విడాకులొచ్చాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్ స్టార్‌గా ఎదిగిన అమలాపాల్ దర్శకుడు విజయ్‌ని వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో విడాకులను మంజూరు చేసింది. గత ఆరునెలలుగా విడివిడిగా వుంటున్నారు. 2014 జూన్ 12న పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లితో అమలాపాల్ ఇన్నాళ్లూ సినిమాలకు దూరంగా వుంది. పెళ్లి తరువాత కూడా సినిమాలకు దూరంగా ఉండాలన్న అత్తింటివారి నిబంధనను కథానాయిక పట్టించుకోకపోవడంతో విభేదాలు తలెత్తాయని సమాచారం. దీనితో దంపతులు ఇరువురూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం వారిద్దరి చేతిలో సినిమాలు ఉండడంతో ఎవరిపనిలో వారు నిమగ్నులై కెరీర్‌పై దృష్టిపెట్టనున్నారు. అమలాపాల్ చేతిలో అరడజను, విజయ్ కూడా రెండు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.