ప్రాధాన్యం ఉంటేనే నటిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళం, తమిళ భాషల్లో 20 చిత్రాలకు పైగా హీరోయిన్‌గా నటించి అనతికాలంలోనే మంచి పెర్ఫార్మర్‌గా పేరుతెచ్చుకున్న మియాజార్జ్ ప్రస్తుతం విజయ్ ఆంటోని హీరోగా జీవశంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి రూపొందిస్తున్న ‘యమన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై చిట్యాల సాయికుమార్‌రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా ఈనెల 24న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ మియాజార్జ్ చెప్పిన విశేషాలు..
* కేరళనుంచి వచ్చా
కేరళలోని కొట్టాయం సమీపంలో పాల స్వగ్రామం మాది. మలయాళ, తమిళ భాషల్లో 20 చిత్రాల్లో నటించాను. అల్రెడీ జీవశంకర్ డైరెక్షన్‌లో ఒక మూవీ చేశాను. విజయ్ ఆంటోనితో జీవశంకర్ ఫస్ట్ మూవీ చేశారు. ఇప్పుడు మా ఇద్దరి కాంబినేషన్‌లో జీవశంకర్ రెండో చిత్రం చేయడం చాలా థ్రిల్లింగ్‌గా వుంది.
* ఆసక్తి రేపే పాత్ర..
ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు అంజన. సినిమాల్లో నటిస్తూ సాధారణ జీవితం గడిపే అమ్మాయి. వెరీ టిపికల్ గర్ల్. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఇదివరకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ వాటన్నింటికంటే ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందరికీ పనిష్‌మెంట్ ఇచ్చే ఎలిమెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సీన్ తర్వాత నెక్ట్స్ సీన్ ఏం వస్తుంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అంత ఇంట్రెస్టింగ్‌గా ఈ చిత్రం ఉంటుంది.
* విజయ్ ఆంటోనితో..
తను బహుముఖప్రజ్ఞాశాలి. మ్యూజిక్ డైరెక్టర్, సౌండ్ ఇంజనీర్, హీరో ఇలా అన్ని బాధ్యతలూ నిర్వహించగలరు. మంచి కథలు ఎంపిక చేసుకుంటూ హీరోగా వరుస సక్సెస్‌లు సాధిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. పర్‌ఫెక్ట్ ప్లానింగ్ వున్న నిర్మాత రవీందర్ రెడ్డి. సినిమాకి ఏం కావాలో, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో తెలిసిన వ్యక్తి. ఆయన బ్యానర్‌లో ఈ చిత్రం చేయడం లక్కీగా భావిస్తున్నాను. ఈ చిత్రం మంచి సక్సెస్ అయి హీరోయిన్‌గా నాకు మంచి పేరు తెస్తుంది.
* తెలుగులో కొనసాగుతా
డెఫినెట్‌గా చేస్తాను. అంతకుముందు లాంగ్వేజ్ ప్రాబ్లంవల్ల కొంచెం భయపడ్డాను. ఇప్పుడు కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటున్నాను. రెగ్యులర్‌గా అన్ని భాషల్లో సినిమాలు చేసి నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని వుంది. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. సెంటిమెంట్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి.
* నటనకు స్కోప్
పెర్ఫామెన్స్‌కి స్కోప్ వున్న క్యారెక్టర్‌లో నటించాలని అనుకుంటున్నాను. రెగ్యులర్ హీరోయిన్‌లా కాకుండా నాకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి. బేసికల్‌గా నేను క్లాసికల్ డాన్సర్‌ని. వెస్ట్రన్ డాన్స్ కూడా వచ్చు. తమిళంలో షరీఫ్ మాస్టర్ వద్ద కోచింగ్ తీసుకుంటున్నాను. ఈ చిత్రంలో నేను సోలో సాంగ్‌లో నటించాను.
* తరువాతి సినిమాలు
చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు.