మా అబ్బాయి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనె్నల క్రియేషన్స్ పతాకంపై కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాశ్‌రావు రూపొందిస్తున్న చిత్రం మా అబ్బాయి. శ్రీవిష్ణు, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను సురేష్ బొబ్బిలి అందించగా, ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సినీనటి రోజా, మల్కాపురం శివకుమార్, దర్శకుడు విరించి వర్మ థియేటర్ ట్రైలర్‌ను, బిగ్ సీడీ, ఆడియో సీడీలను హీరోలు నారా రోహిత్, నాగశౌర్యలు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు శ్రీవిష్ణు మాట్లాడుతూ- కథ చెప్పగానే వైవిధ్యం వుండడంతో ఈ సినిమాను రూపొందించామని, సైనిక పాఠశాలలో చదువుకున్నట్లుగా ఈ సినిమా ఔట్‌పుట్ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దర్శక నిర్మాతలు రూపొందించారని తెలిపారు. సంగీతంతోపాటుగా రీకార్డింగ్ కూడా సినిమాకి హైలెట్‌గా వుంటుందని, మా అబ్బాయిగా వస్తున్న తనను అందరూ ఆశీర్వదించాలని కోరుకున్నారు. దర్శకుడు కథ చెప్పిన విధానం నచ్చడంతో ఈ సినిమా ప్రారంభించామని, హీరో హీరోయిన్లు మంచి డాన్సర్లే కాక మంచి నటులుగా నిరూపించుకుంటారని నిర్మాత ప్రకాశ్‌రావు తెలిపారు.