గిలిగింతలు పెట్టే సినిమా -దర్శకుడు వెంకటేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు వెంకటేష్ రూపొందించిన చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారండీ బాబూ..’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు స్పైసీగా వుండడంతో వెబ్‌సైట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత ప్రశ్నార్థ్ తాత మాట్లాడుతూ- దర్శకుడు వెంకటేష్ తాను ఏం చెప్పదలచుకున్నాడో అదే తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడని, లాభనష్టాల సంగతి పక్కనపెట్టి, యువతకు గిలిగింతలు పెట్టేలా చిత్రాన్ని రూపొందించారని తెలిపారు. సినిమా పోస్టర్లు అశ్లీలంగా, స్పైసీగా యూత్‌ని రెచ్చగొట్టేలా వున్నాయని అందరూ చెబుతున్న నేపథ్యంలో ఔను, తాను అలానే సినిమాను చిత్రీకరించానని చెప్పడాన్ని బట్టి ఈ సినిమా ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. రొమాంటిక్ సినిమా కనుక సినిమా ఫొటోలు కూడా అలాగే వున్నాయని, ఇటీవల విడుదలైన టీజర్ కూడా మంచి ఆదరణ పొందిందని ఆయన అన్నారు. హాట్ చిత్రంగా రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు పెరిగాయని, యువత సినిమాకోసం ఎదురుచూస్తున్నారని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.