అమెరికాలో నాని చిత్రం షూటింగ్-శ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని కథానాయకుడిగా డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ రేపు విడుదల కానుంది. హీరో జన్మదినోత్సవం సందర్భంగా 24న ఫస్ట్‌లుక్‌తోపాటుగా సినిమా పేరును ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య.డి.వి.వి మాట్లాడుతూ- ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ అమెరికాలో జరుగుతున్నదని, వచ్చేనెల 10 వరకూ ఈ షెడ్యూల్‌ను చేస్తామని తెలిపారు. ఓ వెరైటీ కథనంతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పేరు కూడా సరికొత్తగా వుండబోతోందని, నివేదా థామస్ హీరోయిన్‌గా ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రం విజయవంతం అవుతుందని తెలిపారు. తనికెళ్ల భరణి, పృధ్వీ, రాజశ్రీ నాయర్, నీతూ, భూపాల్‌రాజ్, కేదార్ శంకర్, పద్మజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు:కోన వెంకట్, సంగీతం:గోపీ సుందర్, కెమెరా:కార్తీక్ ఘట్టమనేని, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, శ్రీజో, రచన, దర్శకత్వం:శివ నిర్వాణ.