వివాదాల రంగూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందిన డ్రామా పీరియాడికల్ చిత్రం. రొమాంటిక్ సన్నివేశాలుంటాయి. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో సినిమా కొనసాగుతుంది. సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జమాందార్ నవాబ్ మాలిక్‌గా షాహిద్‌కపూర్, రుస్తుం ‘రుషి’ బిల్లిమొరియాగా సైఫ్ అలీఖాన్, మిస్ జూలియాగా కంగనారనౌత్ నటిస్తున్నారు. జపాన్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ నటీనటులకు ఇందులో అవకాశం ఇచ్చారు. పోరాట దృశ్యాలను ఈశాన్య రాష్ట్రాల్లో చిత్రీకరించారు. స్క్రీన్‌ప్లే, కథ మాథ్యూ రాబిన్స్ అందించారు. ఈ చిత్రంలో లీడ్‌రోల్ పోషిస్తున్న కంగనా రనౌత్ మేరీ ఇవాన్స్ జీవిత చరిత్రపై రీసెర్చ్ చేసేందుకు ప్రత్యేకంగా న్యూయార్క్ వెళ్లివచ్చారు. అందులో భాగంగానే మెక్సికోలోని ఓ దీవిలో ‘సోలో లైఫ్’లో తర్ఫీదుపొందారు. 2015లో షూటింగ్ మొదలైంది. నిజానికి ఈ సినిమాకు మొదట ‘జూలియా’ అన్న టైటిల్ పెట్టారు. ఆ తరువాత ‘రంగూన్’గా మార్చారు. అయితే ఈ కథ అంతా మేరీ ఇవాన్స్ (్ఫయర్‌లెస్ నదియా)కు సంబంధించినదేనని, ఆ చిత్రంలో కాస్ట్యూమ్స్, సన్నివేశాలు, సంభాషణలు అన్నీ ఆమెకు సంబంధించినవేనన్న విధంగా ఉన్నాయని, ఆమె చిత్రాలు, ఆమె కథపై తమ సంస్థకు కాపీరైట్ హక్కులు ఉన్నాయని, ఆ నిబంధనలను ఉల్లంఘించి ‘రంగూన్’ చిత్రం నిర్మిస్తున్నారని ‘వాడియా మూవీటోన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముంబై హైకోర్టులో కేసు వేసింది. ముఖ్యంగా ‘బ్లడీ హెల్’ అనే పాటను ఉదహరిస్తూ ఈ ఆరోపణలు చేసింది. ఇంకా ఆ కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ‘రంగూన్’ చిత్రం విడుదలవుతోంది. అయితే ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడేందుకు చిత్రబృందం సిద్ధంగా లేదు. కాకపోతే తొలిసారిగా హీరోయిన్ కంగనా రనౌత్ ఆచితూచి స్పందించారు. ‘ఈ చిత్రంపై వివాదం కోర్టులో ఉన్నందున అన్నీ మాట్లాడలేం. నిజానికి ఈ చిత్రంలో మిస్ జూలియా కథ కేవలం కల్పితం. ఇవాన్స్‌కు సంబంధించినది కాదు. జీవించి ఉన్న లేదా మరణించినవారి జీవితకథ అసలే కాదు.’ అని కంగనా అంటోంది.