సామి సీక్వెల్‌లో త్రిష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ రోల్స్‌కి చెక్‌పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఎక్కువ దృష్టిపెట్టిన స్టార్ హీరోయిన్ త్రిష రీసెంట్‌గా ఒక క్రేజీ ఛాన్స్ దక్కించుకుంది. దర్శకుడు హరి తన హిట్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ విక్రమ్‌తో ‘సామి’ చిత్రానికి సీక్వెల్‌గా ‘సామి-2’ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా ఎవర్ని తీసుకోవాలని ఆలోచించిన తర్వాత దర్శకుడు హరి గతంలో ‘సామి’లో విక్రమ్‌కు జోడీగా నటించిన త్రిష అయితేనే బాగుంటుందని సీక్వెల్‌లో కూడా ఆమెనే ఖాయం చేశాడు. నటి త్రిష కూడా ఈ క్రేజీ ఆఫర్‌కు ఒప్పుకుని ఎక్కడినుండి మొదలయ్యానో మళ్లీ అక్కడికే వచ్చానంటూ ట్వీట్ చేసి ఈ వార్తను అధికారికంగా ఖరారు చేసింది. 2003లో విడుదలైన ‘సామి’ మొదటి భాగం భారీ హిట్‌గా నిలిచి విక్రమ్, త్రిష, దర్శకుడు హరిలకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఇకపోతే త్రిష ప్రస్తుతం ‘శతురంగవెట్టై’, ‘1818’, ‘96’, ‘మోహిని’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.