ఉంగరాల రాంబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ కథానాయకుడిగా క్రాంతి మాధవ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ పతాకంపై పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- కమర్షియల్ హంగులను రంగరించి ఈ సినిమాను గత సునీల్ చిత్రాలకంటే హైస్టాండర్డ్‌లో రూపొందిస్తున్నామని, మార్చి రెండవ వారంలో ఆడియో విడుదల చేసి వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. క్రాంతిమాధవ్ రూపొందించిన రెండు చిత్రాలు వైవిధ్యభరితంగా ఉన్నాయని, అదే స్టైల్లో సునీల్ తరహా కామెడీ మార్క్‌తో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించామని తెలిపారు. మియాజార్జ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, ఆశీష్ విద్యార్థి, వెనె్నల కిశోర్, అలీ, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధునందన్, ప్రభాస్ శ్రీను, తా.రమేష్, దువ్వాసి, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, నల్లవేణు, శ్రీహర్ష, మణిచందన తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:జీబ్రాన్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, రెహమాన్, కెమెరా:సర్వేష్ మురారి, మాటలు:చంద్రమోహన్ చింతాడ, నిర్మాత:పరుచూరి కిరీటి