బెజవాడ నేపథ్యంలో రణరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ పతాకంపై విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనుంది. మంచాల సాయిసుధాకర్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘రణరంగం’అనే టైటిల్‌ని ఖరారుచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మంచాల సాయిసుధాకర్ మాట్లాడుతూ.. ‘ప్రజల అభీష్టంమేరకు ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్రను, ఆయన గొప్పతనాన్ని ఈ చిత్రంలో చూపనున్నాం. ఈ చిత్రం పేరు ‘రణరంగం’. ఈ చిత్రం షూటింగ్‌ని ఆంధ్రా, తెలంగాణాలతోపాటు విదేశాల్లోకూడా షూటింగ్ జరపనున్నాం. అలాగే ఈ చిత్రంలోని ఒక ప్రత్యేకమైన గీతాన్ని విజయవాడలో వేలాది మంది అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నాము. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను విజయవాడ సభలో వెల్లడించనున్నాము’అని అన్నారు.
రైటర్ మరుధూరి రాజా మాట్లాడుతూ.. ‘నాకు 14 యేటనుండి పేపరు చదివే అలవాటుంది. అప్పటి విజయవాడ రాజకీయ నేపథ్యాన్ని ఆకళింపు చేసుకుని, సినిమాగా రాయాలని అనుకున్నాను. విజయవాడ, అనంతపురం రాజకీయ నేపథ్యాలతో నా ఆధ్వర్యంలో ఓ సినిమా ఉండాలని కోరిక ఉండేది. అది ఇన్నాళ్లకు నెరవేరబోతోంది’అని అన్నారు.