చివరిదశలో రోబో-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రోబో.2’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2010లో విడుదలై రకార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన ‘రోబో’కు ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తోంది. భారతీయ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రస్తుతం ఆఖరి దశలో ఉండగా హీరోయిన్ అమీ జాక్సన్ కూడా తన వంతు షూటింగ్‌ను త్వరలోనే పూర్తిచేయనుంది. ఆమెపై చిత్రీకరించాల్సిన సన్నివేశాల ఆఖరి షెడ్యూల్ ఇప్పుడు జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో అమీజాక్సన్, విలన్‌గా నటిస్తున్న అక్షయ్‌కుమార్ మధ్య ఒక పోరాట సన్నివేశం చిత్రీకరిస్తారట. ఈ ఫైట్‌ను హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బ్యాట్స్ రూపొందించనున్నారు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సుమారు రూ.450 కోట్లను ఈ చిత్రంపై వెచ్చిస్తోంది. ఇకపోతే చిత్ర టీజర్ ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసి సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్‌లో ఉన్నారు దర్శక నిర్మాతలు.