బాలయ్యతో పూరి జనగణమన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 101వ సినిమా ఏమిటనే విషయంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి పలువురు దర్శకులు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫైనల్‌గా ఈ సినిమా కన్ఫర్మ్‌అయినట్టు తెలుస్తోంది. అవును బాలయ్య నెక్స్ట్ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉంటుందని, పూరి జగన్నాథ్ ఆమధ్య మహేష్‌తో జనగణమన సినిమాచేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా చేయడానికి మహేష్ పెద్దగా ఆసక్తిచూపకపోవడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లోకి బాలయ్యని దింపేలా ఉన్నాడు పూరి. ఇప్పటికే బాలయ్యతో ఈ సినిమా గురించి చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. ముందు ఎన్టీఆర్ బయోపిక్ చేస్తాడని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వెనక్కివెళ్లినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.