బ్యాంకాక్‌లో నక్షత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశి దర్శకత్వంలో సందీప్‌కిషన్, సాయిధరమ్‌తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యపాత్రల్లో బుట్టబొమ్మ క్రియేషన్స్ పతాకంపై కె.శ్రీనివాసులు, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై వేణుగోపాల్ సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నక్షత్రం’. ఇప్పటికే టాకీ పూర్తిచేసుకుని నేటినుండి పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న సందర్భంగా సినిమా వివరాలను నిర్మాతలు తెలిపారు. ‘టాకీ పూర్తయింది. ఈరోజునుంచి పాటల చిత్రీకరణ బ్యాంకాక్‌లో మొదలుపెడుతున్నాం. సందీప్‌కిషన్, రెజీనాలపై ఒక పాట, సాయిధరమ్‌తేజ్, ప్రగ్యా జైస్వాల్‌పై మరోపాటను అక్కడ చిత్రీకరిస్తున్నాం. దాంతోపాటు మరో ప్రత్యేక గీతం కూడా వుంటుంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో వున్న ఓ యువకుడి కథే ఈ చిత్రం. రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత వుంటుందో, సమాజంలో పోలీస్ పాత్ర అలాంటిది. ఈ పాత్రను ఈ చిత్రంలో ప్రత్యేకంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు కృష్ణవంశి’ వారు చెప్పారు.. ఈ చిత్రానికి సంగీతం:్భమ్స్, కెమెరా:శ్రీకాంత్ నారోజ్, ఎడిటర్:శివ వై.ప్రసాద్, మాటలు:తోట ప్రసాద్, పద్మశ్రీ, కిరణ్ తటవర్తి, పాటలు:అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, నిర్మాతలు:ఎస్.వేణుగోపాల్, సజ్జు, కె.శ్రీనివాసులు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కృష్ణవంశి.