జూన్ 23న మహేష్ సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న 23వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబాయిలో జరుగుతోంది. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా మహేష్ అభిమానుల్లో తెగ ఆసక్తి నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన టైటిల్ వెలువడకపోవడం షాకిస్తోంది. ఇప్పటికే పలురకాల టైటిల్స్ వినిపించినప్పటికీ, ఇంకా ఏ టైటిల్‌ని యూనిట్ ఖరారు చేయలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో మాత్రం చెప్పేశాడు దర్శకుడు. లేటస్టుగా ఓ సందర్భంలో మురుగదాస్ స్పందిస్తూ మా గెస్టులుగా మారడానికి రెడీగా వుండండి, జూన్ 23న వచ్చేస్తున్నామంటూ కామెంట్ చేయడంతో మహేష్ 23వ సినిమా జూన్ 23న విడుదలవుతుందని క్లారిటీ వచ్చేసింది. ఉగాది సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు 41 సెకండ్ల టీజర్ కూడా రెడీ అవుతోందట. మహేష్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తున్న ఈ సినిమాతో 200 కోట్ల మార్కెట్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.