ఆస్కార్ పిలుస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ సినీ అభిమానులు ఎదురుచూస్తున్న వేడుక ఆస్కార్. సినిమారంగానికి నోబెల్ బహుమతిగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ వేడుకకోసం లాస్‌ఏంజిలిస్ సన్నద్ధమైంది. ప్రఖ్యాత దూల్బె థియేటర్‌లో అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుఝామున జరిగే ఈ వేడుక అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమానికి బాలీవడ్ నటి ప్రియాంక చోప్రా హాజరవుతున్నారు. హాలీవుడ్ హాస్యనటుడు జిమ్మి కెమ్మిన్ ఈ కార్యక్రమానికి సమర్పకుడిగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ బరిలో భారతీయ సినిమాలుకాని, నటీనటులు కానీ లేనప్పటికీ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ దీపక్ పోటీపడుతూండటం ఆసక్తిరేపుతోంది. అకాడమీ అవార్డులుగా పిలిచే ఆస్కార్ ను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ సైనె్సస్ ప్రదానం చేస్తోంది. గత ఏడాది విడుదలైన సినిమాలను ఈ అవార్డుల కోసం పరిశీలించి జనవరి 24 న నామినేషన్లను ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న 89వ ఆస్కార్ ఉత్సవంలో 24 విభాగాల్లో విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఆస్కార్ చరిత్రలో ఎక్కువ నామినేషన్లు పొందిన మూడో చిత్రంగా లా లా ల్యాండ్ చరిత్ర సృష్టించడం ఈసారి విశేషం. 14 కేటగిరీలలో ఈ చిత్రం నామినేషన్లు పొందింది. ప్రధాన కేటగిరీలైన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నేపథ్య సంగీతం వంటి విభాగాల్లో ఆస్కార్ వరించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. గతంలో ‘ఆల్ ఎబౌట్ ఈవ్’ (1950), టాటానిక్ (1997) మాత్రమే 14 నామినేషన్లు పొందాయి.
లా లా ల్యాండ్
అమెరికాలో లాస్‌ఏంజిలిస్‌ను ఎల్‌ఎ (ల)గా చెప్పుకుంటారు. ఇది అక్కడి జాతీయంగా భావించాలి. ల ల ల్యాండ్ అంటే లాస్‌ఏంజిలిస్ అనే అర్థం. ఆ పేరుతో దర్శకుడు డామిన్ ఛాజెల్లి రూపొందించిన కథకు సెల్యులాయిడ్ రూపం లా లా ల్యాండ్. నటిగా రాణించాలని కలలగన్న ఓ యువతి, జాజ్ సంగీతానికి సరికొత్త ఒరవడులు కనిపెట్టి చరిత్ర సృష్టించాలన్న ఓ యువకుడు అవకాశాల కోసం పడే తపన, ఇద్దరి కలయిక, ప్రేమ, చివరకు విభేదాలు, వేరే వ్యక్తితో హీరోయిన్ వివాహం, ఆ తరువాత మళ్లీ వారు ఇద్దరూ తారసపడటం ఇతివృత్తం. ఇది సంగీతం, జీవితం, విరహం, ప్రేమ, నాటకీయతతో కూడిన చిత్రం. విమర్శకుల ప్రశంసలు పొందింది. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించింది. యువ నటులు అద్భుతంగా నటించి మెప్పించారు. దర్శకుడ ఛాజెల్లి ఈ కథను 2010లో రాసినప్పటికీ ఎవరూ చిత్రం నిర్మించేందుకు ముందుకురాలేదు. ఆయన తీసిన మరో సినిమా ‘విప్‌లాష్’ (2014)లో హిట్ కావడంతో ‘లా లా ల్యాండ్’పై నిర్మాతలు ఆసక్తి చూపించడంతో తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ర్యాన్ గాస్లింగ్స్, హీరోయిన్‌గా ఎమ్మా స్టోన్ అద్భుతంగా నటించారు.
ఈ చిత్రం తరువాత ఎక్కువ నామినేషన్లు పొందిన చిత్రాలు ఎరైవల్, మూన్‌లైట్. ఇవి 8 చొప్పున నామినేషన్లు సాధించాయి. లయన్, మాంచెస్టర్ బై ది సి, హాక్‌సారిడ్జ్ ఆరు చొప్పున, ఫెనె్సస్, హెల్ ఆర్ హైవాటర్ నాలుగు చొప్పున, హిడెన్ ఫిగర్స్, జాకీ మూడు చొప్పున నామినేషన్లు సాధించాయి. వీటిలో ఫెనె్సస్‌లో నటించిన వాషింగ్టన్ ఉత్తమ నటుడు బరిలో అవార్డు పొందేందుకు పోటీపడుతున్నవారిలో మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా లా లా ల్యాండ్ 74వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో పోటీపడిన ఏడు విభాగాల్లోను, 78వ బ్రిటిష్ గోల్డెన్ అవార్డుల్లో ఐదు విభాగాల్లోను అవార్డులు కైవసం చేసుకుంది. సాధారణంగా ఈ రెండింటిలో నెగ్గిన చిత్రాలకు ఆస్కార్ వరిస్తూండటం ఆనవాయితీ. కాగా గత ఆస్కార్‌లో నల్లజాతీయులు ఎవరికీ అవార్డులు రాకపోవడంపై విమర్శలువచ్చాయి. కాగా ఈసారి పెద్దసంఖ్యలో నల్లజాతి నటీనటులు, సాంకేతిక నిపుణులు నామినేషన్లు సాధించినవారిలో ఉన్నారు. కాగా ట్రంప్ వైఖరికి నిరసనగా చాలామంది సినీప్రముఖులు ఆస్కార్ వేడుకకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. ఉత్తమ నటుడు విభాగంలో కెసి అప్లెక్, అండూగార్‌ఫీల్డ్, ర్యాన్ గుస్లింగ్స్, విగ్లో మార్టిన్‌సెన్, డేంజిల్ వాషింగ్టన్ పోటీపడుతూండగా ఉత్తమ నటి విభాగంలో ఇస్బెల్లా పప్పెర్ట్, రూల్ నిగ్గా, నటాలీ పోర్ట్‌మన్, ఎమ్మా స్టోన్, మేరిస్ట్రీప్, ఉత్తమ దర్శకుడు విభాగంలో డెనిస్ విలేనీవ్, మెల్‌గిబ్సన్, డామిన్ ఛాజెల్లి, కినె్నత్ లెనెర్గాన్, బేరిజెన్సన్స్ ఉన్నారు. విదేశాలనుంచి అమెరికా వచ్చేవారిపై ఉన్న ఆంక్షలకు నిరసనగా అవార్డుల బరిలో ఉన్న నటీనటుల్లో కొందరు హాజరుకావడం లేదు. కాగా హాలీవుడ్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్ నటి దీపికపదుకొనే ఆస్కార్ రెడ్‌కార్పెట్‌కు వెళ్లడం లేదు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఎబిసి సంస్థ ప్రసారం చేస్తున్నది.