చిరు సాయం కలిసొస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా క్లాప్స్ అండ్ విజిల్స్ బ్యానర్‌పై శ్రీ వరుణ్ అట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘గుంటూరోడు’. ప్రేమలో పడ్డాడు క్యాప్షన్‌తో తెరకెక్కిన ఈ చిత్రంతో దర్శకుడిగా మరో విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు ఎస్.కె.సత్య. ఈ చిత్రం మార్చి 3న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు ఎస్.కె.సత్య ఇంటర్‌వ్యూ..
మనోజ్‌తోనే చేయడానికి గల కారణం?
ఇప్పటివరకూ మనోజ్ ఇలాంటి సబ్జెక్ట్‌ని చేయలేదు. అన్ని అంశాలు కలిపిన మంచి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. కథ అనుకున్నప్పుడు మనోజ్ అయితే బెటర్ అనిపించింది. ఎందుకంటే తన బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ, ఎమోషన్స్ పండించగల సత్తా వున్నాయి. దాంతోపాటు ఈ సినిమాతో అతని రేంజ్ కూడా పెరుగుతుంది.
అసలు కథేమిటి?
ఈ సినిమా ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టే తిరుగుతుంటుంది. దాంతోపాటు మంచి ప్రేమకథ కూడా వుంటుంది. ముఖ్యంగా నాలుగు పాత్రల చుట్టూ తిరిగే విధానంలో వచ్చే కథ మంచి ఎమోషన్‌ను పండిస్తుంది. రాజేంద్రప్రసాద్, కోట, మనోజ్, సంపత్- ఈ నలుగురే సినిమాకు కీలకం.
చిరంజీవితో వాయిసోవర్ చెప్పించడానికి కారణం?
సినిమాలోని ప్రధాన పాత్రల్ని పరిచయం చేయడానికి ఓ బలమైన, పాపులరైన వాయిస్ కావాలి. ఎవరితో అయితే చేయిస్తే బావుంటుందని చాలామందిని అనుకున్నాం. చివరగా మనోజ్ చిరంజీవిగారితో చేయిద్దామని చెప్పారు. నాక్కూడా బాగా నచ్చింది. వెంటనే ఆయన్ను వెళ్లి కలిశాము. ఆయన కూడా ఒప్పుకుని వాయిసోవర్ అందించారు. ఆ వాయిసోవర్‌తో సినిమాకు కొత్త హైప్ క్రియేట్ అయింది.
ఈ సినిమాపట్ల మోహన్‌బాబు ఎలా స్పందించారు?
సినిమా బాగా వచ్చింది. ఇంతకుముందే మంచు ఫ్యామిలీ మొత్తం సినిమా చూశారు. ముఖ్యంగా మోహన్‌బాబు మనోజ్‌ను అలా పూర్తిస్థాయి మాస్ హీరోగా చూసి చాలా సంతోషించారు.
ప్రగ్యా జైస్వాల్ నటన ఎలా ఉంది?
ఇందులో హీరోయిన్ పాత్రకు కూడా ప్రాముఖ్యత వుంటుంది. ఫస్ట్ఫాలో ఆమెదే కీరోల్. అమ్మాయిలంటే ఊరికే అబ్బాయిలకు పడిపోరని, అమ్మాయిలకు కూడా కొన్ని విధివిధానాలు ఉంటాయని చెప్పే పాత్ర. పైగా వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.
బడ్జెట్ ఎలా వుంది?
వరుణ్‌కు సినిమాలంటే చాలా ఇష్టం. ఏదో సినిమా తీశామని కాకుండా మంచి సినిమా తీయాలనే కసితో ఈ సినిమా చేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ముఖ్యంగా మనోజ్ మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెటే సినిమాకు పెట్టారు.
ఆడియో రెస్పాన్స్ బాగుందా?
ఇప్పటికే విడుదలైన పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతోపాటు సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫి లాంటి అంశాలన్నీ హైలెట్‌గా నిలుస్తాయి.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం ఈ సినిమా విడుదల తరువాతే వుంటుంది. ఇప్పటికైతే చర్చలు జరుగుతున్నాయి.

- శ్రీ