గ్రామీణ నేపథ్యంలో శివకాశీపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు రాజేష్ చక్రవర్తి, ప్రియాంక శర్మ జంటగా హరీష్ వట్టికూటి దర్శకత్వంలో సాయి హరీశ్వర్ ప్రొడక్షన్స్ పతాకంపై మోహన్‌బాబు పులిమామిడి నిర్మిస్తున్న చిత్రం ‘శివకాశీపురం’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అనంతరం దర్శకుడు హరీష్ మాట్లాడుతూ- చక్రవర్తి మనవడు ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయడం ఆనందంగా వుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చేలా వుంటుంది అన్నారు. నిర్మాత మోహన్‌బాబు మాట్లాడుతూ- సినిమాలంటే వున్న పాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చానని, తనకు ఇష్టమైన సంగీత దర్శకుడు చక్రవర్తని, ఆయన మనవణ్ణి హీరోగా పరిచయం చేస్తుండడం ఆనందంగా వుందని అన్నారు. మంచి కథ, కథనంతో దర్శకుడు హరి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు అన్నారు. హీరో రాజేష్ మాట్లాడుతూ- దర్శకుడు అద్భుతమైన కథ చెప్పారని, హీరోగా తనకు మంచి సినిమాగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:పవన్‌శేష, కెమెరా:జయ జి.రాంరెడ్డి, ఎడిటర్:జియోథామస్, నిర్మాత:మోహన్‌బాబు పులిమామిడి, దర్శకత్వం:హరీష్ వట్టికూటి.