జోరుమీదున్న బిత్తిరి సత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిత్తిరి సత్తి అంటే తెలియనివారుండరని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనతి కాలంలోనే యాంకర్‌గా విశేషమైన పాపులారిటీ దక్కించుకొన్న బిత్తిరి సత్తి ఈమధ్య సినిమాల్లోనూ కనిపిస్తూ అలరిస్తున్నాడు. నిన్న విడుదలైన ‘విన్నర్’లో బిత్తిరి సత్తిది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు బిత్తిరి సత్తి. త్వరలో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గౌతమ్ నంద’లో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో కనిపించనున్నాడు. ఇదికాకుండా ఎన్.శంకర్, సునీల్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా, జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో మినిస్టర్ గంటా శ్రీనివాస్ తనయుడు గంటా రవితేజ కథానాయకుడిగా పరిచయమవుతూ తెరకెక్కుతోన్న చిత్రం మరియు రానా, తేజ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలోనూ బిత్తిరి సత్తి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇవికాకుండా ఇంకొన్ని చిత్రాల్లోనూ నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు. చూస్తుంటే.. తెలుగు చిత్రసీమకు బిత్తిరిసత్తి రూపంలో మరో బ్రహ్మాండమైన కమెడియన్ దొరికినట్లే!