అదిరేటి డ్రెస్సు మీరేస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్కార్ సంరంభం మొదలైంది. ఇప్పటికే లాస్‌ఏంజిలిస్‌లోని డూల్బె థియేటర్ అవార్డుల ప్రదానోత్సవానికి ముస్తాబైంది. మరోవైపు ప్రీ ఆస్కార్ కాక్టెయిల్ విందుకు హాజరైన తారలు కొత్తకళను తీసుకువచ్చారు. అందచందాలు, సరికొత్త డిజైన్లు, ముచ్చటగొలిపే దుస్తులు, మేకప్‌తో వారు ఆహూతులను ఆకట్టుకున్నారు. ఆస్కార్ నామినేషన్లు పొందిన నటీమణుల గౌరవార్ధం నిర్వహించే ఈ ప్రి ఆస్కార్ కాక్టెయిల్ విందును 3విమెన్ ఇన్ ఫిల్మ్2 సంస్థ నిర్వహిస్తుంది. లాస్‌ఏంజిలిస్‌లోని నైటింగేల్ ప్లాజాలో నిర్వహించిన ఈ వేడుకకు విమెన్ ఇన్ ఫిల్మ్ సంస్థ అధ్యక్షురాలు కేథి షుల్మన్ సారథ్యం వహించారు. హాలీవుడ్ తారలు, ఉత్తమ నటి కేటగిరీలో నామినేషన్ పొందిన ప్రముఖ తార ఎమ్మాస్టోన్, గాబ్రియేల్ సహా మెరిల్ స్ట్రీప్, బైలార్స్‌న్, వియొడేవిస్ వంటివారు హాజరయ్యారు. సినీ, రాజకీయ రంగానికి చెందిన మరెందరో మహిళలు హాజరైన ఈ ఉత్సవంలో బాలీవుడ్ తారలు పరీద పింటో, ప్రియాంక చోప్రా, దీపికపదుకొనె హాజరయ్యారు. ఇద్దరూ నలుపురంగు దుస్తుల్లో మెరిసిపోయారు. 3క్వాంటి కో2 సీరియల్ ద్వారా ఇప్పటికే హాలీవుడ్‌కు పరిచయమైన ప్రియాంక అమెరికాలో జరిగిన పలు చిత్రోత్సవాలకు హాజరై పేరుతెచ్చుకున్నారు. ప్రస్తుతం డ్వేన్‌జాన్సన్‌తోకలసి 3బేవాచ్2 సినిమాలో నటిస్తున్న ప్రియాంక ఆస్కార్ రెడ్‌కార్పెట్‌పైకూడా సందడి చేయనున్నారు. మరోవైపు దీపిక రెడ్‌కార్పెట్ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కాగా ఆస్కార్ ప్రి కాక్టెయిల్ విందుకు మాత్రం హాజరై అభిమానులను అలరించింది. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంతో పేరుతెచ్చుకున్న భారతీయ నటి ఫరిదాపింటో నీలిరంగు దుస్తుల్లో అలరించింది.
నిజానికి ప్రియాంక, దీపికలకన్నా ఈమె ప్రభావం ఎక్కువగా కనిపించింది. విమెన్ ఇన్ ఫిల్మ్ వేడుకలో పాల్గొన్న ఫరిదా ఈ సందర్భంగా మాట్లాడింది కూడా. 3మహిళలు లేకుండా సినిమా తీయగలరా2 అంటూ ప్రశ్నలు సంధించింది. ప్రతిభకు, పరిణతికి, అవకాశాలకు, చొరవకు మహిళలు పెట్టిందిపేరని వ్యాఖ్యానించింది. కాగా మరికొద్ది గంటల్లో అవార్డుల ప్రదానం పూర్తయి రెడ్‌కార్పెట్ హంగామా మొదలవుతుంది.

అతిథులతో ప్రియాంక