కాదంటే ఔననిలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటీష్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సాల్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతూనే మా ఇద్దరి మధ్యనా ఏమీలేదు అంటోంది శ్రుతిహాసన్. వారిద్దరి ప్రేమనీ ఎంతగా ఆమె దాచాలని చూసినా మీడియా ఇంటరాక్షన్ ఎక్కువగా ఉన్న ఈ కాలంలో అది బయటపడిపోతూ ఉండడం విశేషం. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇద్దరూ ముంబైలో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు కూడా. ‘ఇండియాలో ఓ మంచి అమ్మాయితో చక్కటి సమయాన్ని గడిపాను. అందమైన స్నేహితుల బృందం ఇక్కడుంది. ఇండియా నాకు రెండో ఇల్లు’ అని వ్యాఖ్యానిస్తూ, మైఖేల్ ఈ ఫొటోను పోస్టుచేశాడు. కాగా, బ్రిటీష్ ఆల్టర్నేటివ్ రాక్ బ్యాండ్‌లో ప్రదర్శన నిమిత్తం వెళ్లిన శృతికి ఓ స్నేహితుడి ద్వారా మైఖేల్ పరిచయం కాగా, వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

చిత్రం..శ్రుతిహాసన్