పెళ్లిచూపులుతోనే గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘పెళ్లిచూపులు’ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ సినిమాతో హీరోగా భారీ ఇమేజ్‌ని సొంతం చేసుకుని హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు హీరో విజయ్ దేవరకొండ. ఆయన నటిస్తున్న తదుపరి చిత్రం ‘ద్వారక’. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 3న విడుదలవుతున్న సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు...
ద్వారక అంటే...
ఇప్పటిదాకా నేను అలాంటి పాత్ర చేయలేదు. చాలా బావుంది. దొంగ బాబా పాత్ర. ఎర్ర శీను అనే కేరెక్టర్‌లో చేశా. వినగానే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఈ చిత్రంలో ద్వారక అనే అపార్ట్‌మెంట్ ఉంటుంది. దానిలో జరిగే అంశాలకు, సినిమాకు సంబంధం ఉంటుంది. రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తులతో హీరో కలిసినపుడు ఏం జరిగిందన్నది ఈ సినిమా. దొంగతనాలు చేస్తుంటాను. ఒకసారి దాన్నుంచి బయటపడటానికే ఈ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తాను. నేను కూడా అపార్ట్‌మెంట్‌లో ఉన్నాను.
ఒకప్పుడు అపార్టుమెంట్లు సరదాగా వుండేవి. ఇప్పుడు ఏ అపార్ట్‌మెంట్‌లో ఎవరున్నారో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితి ఉంది.
అందరూ గుర్తుపట్టేసారూ..
‘పెళ్లిచూపులు’ తర్వాత అందరూ బాగానే గుర్తుపడుతున్నారు. మావైపు బారాత్ వెళ్లినా, ఇంకేదైనా ఊరేగింపు వెళ్లినా, మా అపార్ట్‌మెంట్ ముందు ఆగి విజయ్‌ని కిందికి రమ్మని పిలుస్తున్నారు. అందుకే మా నాన్న నాతో ఈమధ్య ఒక మాట అన్నారు. ‘ఎక్కువగా విండోస్ వైపు ఉండకురా. ఎవరైనా అడిగితే షూటింగ్‌లో ఉన్నావని చెప్తా’ అని అన్నారు. షూటింగ్‌వల్ల పర్సనల్ లైఫ్‌కు దూరం అవుతున్నట్లుంది. ఇప్పటికీ ఏ మాత్రం సమయం దొరికినా నా స్కూల్ ఫ్రెండ్స్‌తో వాలీబాల్ ఆడుకుంటుంటా. కాస్త జనాలు ఎక్కువుంటే క్రికెట్ ఆడుకుంటాం. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం.
ముద్దుల గురించి
ముద్దు పెట్టగానే అందరూ ఇమ్రన్‌తో పోలిస్తే చాలా చిరాకుగా వుంది. నా దృష్టిలో ప్రతి మగవాడూ ముద్దుపెట్టగలిగినవాడే. అలాంటప్పుడు ఇమ్రన్‌తో మాత్రమే ఎందుకు పోల్చాలి. అంటే మిగిలిన మగవాళ్లను కించపరిచినట్టేగా. ఈ సినిమాలో హీరోయిన్‌తో రెండుసార్లు ముద్దులున్నాయి. పెళ్లిచూపులతో మంచి క్రేజ్ వచ్చింది. అందుకే ఆ క్రేజ్‌ని వాడుకున్నా..
తదుపరి సినిమాలు
ప్రస్తుతం అర్జున్‌రెడ్డి విడుదలకుంది. ఆ తర్వాత గీతా ఆర్ట్స్‌లో రెండు సినిమాలున్నాయి. ఒకటి రాహుల్‌తో, మరొకటి పరశురామ్‌తో.

-యూ