పాటల్లో వెంకటాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమ మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ సాంగ్‌ను స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చిత్ర యూనిట్ సమక్షంలో లాంచ్ చేశారు. ఇక వెంకటాపురం చిత్రానికి సంబంధించి నిర్మాత అల్లు అరవింద్ చేతులమీదుగా విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. పది లక్షలకుపైగా వ్యూస్ మార్క్ దాటింది. ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకుంది. సరికొత్త కథాంశంతో సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. హీరో రాహుల్ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఇప్పుడు వినాయక్ విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ కూడా సంగీత ప్రియులను బాగా అలరిస్తోంది. ఈ సాంగ్ సినిమాకు బాగా ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వెంకటాపురం చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ ఇతర ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.