నాలుగుసార్లు పడిపోయా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది చిరంజీవి తర్వాత మెగా కుటుంబం నుండి సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మొదటినుండి మంచి క్రేజ్‌ను బిల్డప్ చేసుకుంటూ వచ్చిన ఈ చిత్రంతో తేజ్ తన కెరీర్లోనే ఉత్తమమైన ఓపెనింగ్స్ సాధించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేజ్ మాట్లాడారు.
* విడుదల తర్వాత ఎలా ఉంది?
- సినిమాకి ప్రేక్షకుల రెస్పాన్స్ బాగుంది. కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఓపెనింగ్స్ కూడా చాలా బాగున్నాయి. రోజురోజుకి స్పందన పెరుగుతుండడం నాకు, నా నిర్మాతలకు చాలా సంతోషం కలిగిస్తోంది.
* చిత్రాన్ని ఏ ప్రాతిపదికన అంగీకరించారు?
- కథను బట్టే చేయాలనిపించింది. బ్యాక్‌డ్రాప్ కొత్తగావుంది. తండ్రీ కొడుకుల అనుబంధం ఆకట్టుకుంది.
* మీనాన్నగారు సినిమా చూశారా?
- ఇంకా చూడలేదు, చూస్తారు.
* పాతమూసలో హీరో ఇంట్రడక్షన్
ఉందనిపించలేదా?
- కమర్షియల్ సినిమా కనుక.. విలన్స్‌కు బుద్ధి చెప్పేటప్పుడు హీరో ఎంటర్ కావాలి. తను ఎలా వచ్చాడనేదానికన్నా ప్రేక్షకుడికి వినూత్నంగా అనిపించాలి. అదే నాకు నచ్చింది.
* ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయ?
- నేను ఈ కలెక్షన్ల లెక్కల్ని, నెంబర్ గేమ్‌ని పెద్దగా పట్టించుకోను. నేను చేయగలిగినదంతా చేశాను. నా నిర్మాతలకు పెట్టిన డబ్బు తిరిగొచ్చేస్తేనే నాకు సంతోషంగా వుంటుంది.
* నిర్మాతలు ఎక్కువ డబ్బు పెట్టారనిపించిందా?
- నేనేమీ స్టార్ హీరోని కాదు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా. నిర్మాతలు డబ్బు పెట్టింది నా మీద కాదు, మంచి స్టోరీ లైన్‌మీద. సబ్జెక్ట్ హెవీగా వుంది. దాన్ని గొప్పగా తీయాలంటే డబ్బు కాస్త ఎక్కువే పెట్టాలి. రిచ్ విజువల్స్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ప్రతి ఒక్కరు వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అస్సలు ఫీల్ అవ్వడంలేదు.
* మీ అమ్మగారి రియాక్షన్ ఏంటి?
- అమ్మ చాలా సంతోషించారు. మా సోదరుడు, ఫ్రెండ్, నటుడు నవీన్ నా బెస్ట్ క్రిటిక్. వాళ్లందరికీ సినిమా మచ్చింది. ముఖ్యంగా జగపతిబాబుతో వుండే సన్నివేశాలు చాలా బాగున్నాయంటున్నారు.
* జగపతిబాబుతో పనిచేయడం ఎలా ఉంది?
- ఇండస్ట్రీలో ఉన్న ఉత్తమమైన నటుల్లో జగపతిబాబు కూడా ఒకరు. నేను రీటేక్స్ తీసుకునేటప్పుడు చాలా ఓపిగ్గా ఉండేవారు. ఆయన సపోర్టు నాకే మరీ ఎక్కువగా ఉందనిపించింది.
* డైలాగ్స్‌లో మెగా హీరోల చిత్రాలపై
స్పందించారు, అదెలా?
- అవన్నీ దర్శకుడి ఆలోచనలే. ఆయన చెప్పినట్టే చేశాను. ఒకసారి సెట్లోకి అడుగుపెట్టాక పూర్తిగా దర్శకుల హీరోగా మారిపోతాను. వాళ్లు ఏది చెబితే అది చేసేస్తాను.
* గుర్రపు స్వారీ నేర్చుకున్నారా?
- చిన్నతనంలో నేర్చుకోవాలనిపించలేదు. చరణ్ వెళుతుంటే చూసేవాడిని. సినిమాకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. శిక్షకుని సంరక్షణలో గుర్రాల ప్రవర్తన ఎలా వుంటుంది, దానికి తగినట్లు మనల్ని మనం ఎలా మలచుకోవాలనేది కొన్ని టిప్స్ తెలుసుకున్నా. క్లైమాక్స్‌లో నాలుగుసార్లు కిందపడ్డాను కూడా. అప్పుడు అమ్మ గుర్తుకువచ్చింది.
* స్టైలిష్ లుక్ వెనుక సీక్రెట్ ?
- అంతా ప్లాన్ ప్రకారమే చేశాం. ఒక న్యూస్‌పేపర్ క్రియేటివ్ హెడ్ కాబట్టి అలా స్టైలిష్ లుక్ ట్రై చేశాం. నా లుక్ అంత స్టైలిష్‌గా ఉండటానికి నా టీమే కారణం. క్రెడిట్ అంతా వాళ్లదే.
* మీ పెళ్లి విషయం ప్రస్తావించలేదా?
- చాలాసార్లు అడిగింది. ఇంతకుముందు సంపాదన లేదు. ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నా. మొన్నటివరకూ స్కూల్, కాలేజీ.. మీరు చెప్పినట్లు విన్నా.. ఇపుడు కనీసం నాకు కొంచెం ఫ్రీడం ఇవ్వండని అడిగాను. రేపు ఎలాగూ పెళ్లయితే ఆమె మాట వినాలిగదా. మనకు దొరికే ఫ్రీడం ఈ కొద్దికాలమే. అందుకే నాలుగేళ్ల తర్వాత మేరేజ్ గురించి మాట్లాడమని చెప్పాను.
* ఖైదీ 150 సినిమాని చూశారా?
- చూసి.. గంతులేయడం కూడా జరిగింది.. అమ్మడు.. కుమ్ముడు పాటకు. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి తెగ డాన్స్ వేసేశా.
* మామయ్యలు సినిమా చూశారా?
- చిరు మామయ్యకు కాస్త హెల్త్ బాగోలేదు. త్వరలో చూస్తారు. పవన్ మామయ్య షూటింగ్‌లో బిజీగా వున్నారు.
* ముగ్గురు మామయ్యల్ని ఎలా చూస్తారు?
- వాళ్లనుంచి చాలా నేర్చుకున్నా. మనం మాట్లాడేది చాలా స్పష్టంగా సింపుల్‌గా నిదానంగా వుండాలి. ఇదివరకు స్పీడ్‌గా మాట్లాడేవాడిని. ఎదుటివారికి పెద్దగా అర్థమయేది కాదు. ఇక చిరంజీవి మామయ్య నాకు దేవుడితో సమానం.
* మీ ఫ్రెండ్స్‌తో ఎలా వుంటారు?
- నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్.. సీనియర్ నరేష్ అబ్బాయి. చెన్నైలో వుండగా ఇద్దరూ నిక్కర్లనుంచి ఫ్రెండ్స్. ఫెయిల్యూర్స్, సక్సెస్‌ల్ని అతనితో పంచుకుంటాను. నాకు మోరల్ సపోర్టు ఇస్తాడు.
* వీరు కాకుండా ఇండస్ట్రీలో ఫ్రెంఢ్స్ ఉన్నారా?
- మా ఫ్యామిలిలోనే ఉన్నారు. బయటి ఫ్రెండ్స్ కూడా వున్నారు. ఇక రకుల్, రాశీఖన్నా.. మేమంతా కలిసి ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. చాలా సరదాగా వుంటాం.
* తదుపరి చిత్రాలు
- నక్షత్రం చేస్తున్నా. 15 నిమిషాల పాత్ర. జవాన్ సినిమా చేయబోతున్నా.

-శ్రీ