ఉత్కంఠగా రా..రా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రా.రా..’ ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ద్వితీయ ప్రచార చిత్రం విడుదల వేడుక నరసరావుపేటలో జరిగింది. శ్రీకాంత్ కథానాయకునిగా ‘రా’ పేరుతో రూపొందుతున్న ఈ నూతన చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించిన విషయం విదితమే. ద్వితీయ ప్రచార చిత్రం మరియు చిత్రంలోని ఓ గీతాన్ని నరసరావుపేటలోని శ్రీమిత్ర జూనియర్ కాలేజీలో విద్యార్థినీ విద్యార్థుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డి.ఐ.జి జె.సత్యనారాయణరావు, ప్రముఖ కథానాయిక కేథరిన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు కళాశాలలో ఉన్నత ర్యాంక్ సాధించిన విద్యార్థినీ విద్యార్థుల చేతులమీదుగా ‘రా.రా..’ ద్వితీయ ప్రచార చిత్రం మరియు చిత్రంలోని ఓ గీతం విడుదలయింది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఇది హాస్యంతో కూడిన హారర్ థ్రిల్లర్ చిత్రం. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింపజేస్తాయి. హారర్ కామెడీ థ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘రా.రా’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.