151వ సినిమా ఖరారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటే అవుననే సమాధానం వస్తుంది! రీఎంట్రీ ఇస్తూ 150వ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నంబర్ 150వ సినిమాతో బాక్సాఫీసు వంద కోట్ల మార్క్ కొల్లగొట్టిన చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏమిటనే విషయంపై మెగా ఫాన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై పలు వార్తలు వచ్చినప్పటికీ 151వ సినిమా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఎలాగంటారా.. ఈ సినిమా గురించి హీరో శ్రీకాంత్ చెప్పేసాడు. లేటెస్ట్‌గా ఓ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడుతూ అన్నయ్య చిరంజీవి 151వ సినిమాగా మొదటి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేస్తున్నాడు అని చెప్పాడు. దాంతో చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏమిటంటే విషయం కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథాచర్చలు జరిగాయని, ఇప్పటికే పరుచూరు బ్రదర్స్ స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నట్టు తెలిసింది. రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని, సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తాడు. సో త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.