ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకుడు దేవా కట్టా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని ప్రకటించినప్పటి నుండి ఈ ప్రాజెక్టు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకీ ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించే దర్శకుడెవరో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈమధ్యే పూరి జగన్నాథ్ ఈ సినిమా తీస్తారని అనుకుంటున్నారు. కానీ పూరి వేరే సినిమాతో బాలయ్యను కమిట్ చేశాడు. ఇక ఎన్టీఆర్ సినిమాకు దర్శకుడు ఎవరు? ఈ సినిమా ఎప్పుడు వస్తుందన్న విషయంలో ఒక సందేహం తీరింది. ఈ సినిమాకు దర్శకుడు దొరికాడు! ఆయనే దేవా కట్టా. ప్రస్థానం సినిమాతో టాలెంటెడ్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న దేవా కట్టా ‘ఆటోనగర్ సూర్య’ ఫ్లాప్‌తో వెనకపడ్డాడు.
కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఓ సామాన్య కుటుంబంలో పుట్టి, నట దిగ్గజంగా, రాజకీయ నేతగా ఎదిగిన ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించగల సమర్థుడు దేవా కట్టా అని భావించి ఈ బాధ్యతలు ఆయనకు అప్పగించారని తెలిసింది. ఈ చిత్రాన్ని సిసిఎల్ క్రికెట్ లీగ్ డైరెక్టర్ విష్ణువర్థన్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.