ఈగ, మిర్చిలకు నందుల పంట (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులు - 2012)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమ చిత్రం: ఈగ
ద్వితీయ ఉత్తమ చిత్రం: మిణుగురులు
తృతీయ ఉత్తమ చిత్రం: మిథునం
కుటుంబ కథాచిత్రం: ఇష్క్
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: జులాయి
ఉత్తమ ఎడ్యుకేషనల్ చిత్రం: సిరి
ఉత్తమ గ్రంథం:ప్రస్థానం
ఉత్తమ క్రిటిక్: మామిడి హరికృష్ణ
ఉత్తమ దర్శకుడు:ఎస్.ఎస్.రాజవౌళి (ఈగ)
ఉత్తమ నటుడు: నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ నటి: సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ సహాయ నటుడు: అజయ్ (ఇష్క్)
ఉత్తమ సహాయనటి: శ్యామలాదేవి (వీరంగం)
ఎస్.వి.రంగారావు స్మారక ఉత్తమ కేరెక్టర్ ఆర్టిస్ట్: ఆశీష్ విద్యార్థి (మిణుగురులు)
అల్లురామలింగయ్య స్మారక ఉత్తమ హాస్యనటుడు:రఘుబాబు
(ఓనమాలు)
ఉత్తమ విలన్: కిచ్చా సుదీప్ (ఈగ)
ఉత్తమ బాలనటుడు: దీపక్ సరోజ్ (మిణుగురులు)
ఉత్తమ బాలనటి: రోషిణి (మిణుగురులు)
తొలి ఉత్తమ దర్శకుడు: అయోధ్యాకుమార్ కృష్ణంశెట్టి
(మిణుగురులు)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత: ఎస్.ఎస్.రాజవౌళి (ఈగ)
ఉత్తమ కథకుడు: అయోధ్యాకుమార్ కృష్ణంశెట్టి (మిణుగురులు)
ఉత్తమ మాటల రచయిత: తనికెళ్ల భరణి (మిథునం)
ఉత్తమ పాటల రచయిత: ఎటో వెళ్లిపోయింది మనసులో
‘కోటి కోటి తరాల్లోనా..’
ఉత్తమ కెమెరామేన్: కె.కె.సెంథిల్‌కుమార్ (ఈగ)
ఉత్తమ సంగీత దర్శకులు :ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి
(ఎటో వెళ్లిపోయింది మనసు, ఈగ)
ఉత్తమ గాయకుడు: శంకర్ మహదేవన్
(షిరిడీ సాయిలో ‘ఒక్కడే దేవుడు..)
ఉత్తమ గాయని: గీతామాధురి
(గుడ్‌మార్నింగ్‌లో ‘యెదలో నాదేలాగా..’)
ఉత్తమ ఎడిటర్:కోటగిరి వెంకటేశ్వరరావు (ఈగ)
ఉత్తమ కళాదర్శకుడు:ఎస్.రామకృష్ణ (అందాల రాక్షసి)
ఉత్తమ నృత్యదర్శకుడు: జానీ
(జులాయి చిత్రానికి ‘నీ ఇంటికి ముందో గేటు..’)
ఉత్తమ ఆడియోగ్రాఫర్:కడియాల దేవీకృష్ణ (ఈగ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : తిరుమల
(కృష్ణం వందే జగద్గురుం)
ఉత్తమ రూపశిల్పి:చిత్తూరు శ్రీనివాస్ (కృష్ణం వందే జగద్గురుం)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్:ముక్తా వి.ఎఫ్.ఎక్స్ (ఈగ)
స్పెషల్ జ్యూరీ అవార్డ్:లక్ష్మి (మిథునం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (మిథునం)
స్పెషల్ జ్యూరీ అవార్డు:ఎటో వెళ్లిపోయింది మనసు

ఎన్నాళ్లుగానో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న 2012, 2013 సంవత్సరాలకుగాను ఉత్తమ చిత్రాలకు ప్రతి సంవత్సరం అందజేస్తున్న నంది అవార్డుల ప్రకటన నేడు వెలువడింది. ఈ ప్రకటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. 2012కుగాను ‘ఈగ’ చిత్రానికి దాదాపుగా 8 అవార్డులు లభించి పరుగుపందెంలో ముందు నిలిచింది. ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా, ఉత్తమ విలన్, ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్, ఉత్తమ కెమెరామేన్, సంగీతం, ఎడిటింగ్, ఆడియోగ్రాఫర్, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో నందులు సాధించి ముందువరుసలో నిలబడింది. ‘ఈగ’ చిత్రంపై మొదటినుంచీ వున్న అంచనాలను ఈ ఫలితాలు నిజం చేశాయి. రాజవౌళి రూపొందించిన వైవిధ్యమైన కథనంతో రూపొందిన ఈ సినిమాలో ఓ చిన్న ఈగ తనకు గత జన్మలో జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి ఎలా పోరాడింది అనే కథనాన్ని వైవిధ్యభరితంగా చిత్రీకరించిన విధానం ప్రేక్షకులకు నచ్చి అందులో సుదీప్ విలనిజం, ఎస్.ఎస్.రాజవౌళి స్క్రీన్‌ప్లే మాయాజాలం, కె.కె.సెంథిల్ కుమార్ చిత్రీకరించిన విధానం, కీరవాణి ఆయా సన్నివేశాలకు అందించిన నేపథ్య సంగీతం, ఎడిటర్ పనితనం, ఆడియోగ్రాఫర్ ఈగ మాటలను రికార్డు చేసిన విధానం, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కలిపి ఈగ చిత్రాన్ని రేస్‌లో నెంబర్ వన్‌గా నిలబెట్టింది. ఆ తరువాత కృష్ణంశెట్టి అయోధ్యాకుమార్ వైవిధ్యమైన కథను తీసుకుని రూపొందించిన ‘మిణుగురులు’ చిత్రం నిలిచింది. ఈ చిత్రానికి దాదాపుగా ఆరు అవార్డులు లభించాయి. ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికై మంచి కథా చిత్రాలకు ఆదరణ వుంటుందని నిరూపించింది. ఈ చిత్రానికిగాను ఆశీష్ విద్యార్థికి ఉత్తమ విలన్‌గా, దీపక్ సరోజ్‌కు ఉత్తమ బాలనటుడిగా, ఉత్తమ బాలనటిగా రోషిణి, ఉత్తమ కథా రచయితగా దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి అందుకోగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆర్.సి.ఎం.రాజు మిణుగురులు చిత్రానికి అవార్డులు అందుకున్నారు. ఇంకా ఇష్క్, జులాయి, సిరి లాంటి చిత్రాలు కూడా అవార్డులను అందుకొని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జ్యూరీ స్పెషల్ అవార్డులలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’లో నటించిన అంజలికి, ‘ఓ మల్లి’ చిత్రంలో నటించిన రమ్యకు, ‘నా బంగారుతల్లి’ చిత్రంలో లీడ్ పాత్ర పోషించిన సిద్దిఖికి అవార్డులు లభించడం విశేషం.
ఇక 2013కుగాను ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘మిర్చి’ చిత్రానికి అవార్డులు అందాయి. ఉత్తమ నటుడిగా ప్రభాస్ రాణించగా, ఉత్తమ విలన్‌గా సంపత్‌రాజ్, ఉత్తమ దర్శకుడిగా కొరటాల శివ, ఉత్తమ గాయకుడిగా కైలాష్ ఖేర్, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ.ఎస్.ప్రకాష్ అందుకోగా, ఉత్తమ తొలి దర్శకుడిగా కొరటాల శివ ఈ చిత్రం నుంచే అవార్డు అందుకోవడం విశేషం. ఆ తరువాత ‘నా బంగారుతల్లి’ అవార్డాల రేసులో నిలిచింది. ఇందులో ఉత్తమ నటిగా అంజలి పాటిల్, ఉత్తమ లీడ్ రోల్‌లో ‘నా బంగారు తల్లి’లో తండ్రి పాత్రలో నటించిన సిద్ధిఖి అందుకున్నారు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం విశేష ప్రజాదరణ పొందిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలో నటించిన నదియాకు ఉత్తమ సహాయనటిగా అవార్డు లభించింది.
మొత్తానికి ఈ అవార్డులు ఉత్తమంగా ఉన్న చిత్రాలు ఎప్పటికైనా విశేషమైన గుర్తింపు పొందుతాయని నిరూపించాయి. ఈ సినిమాలు విడుదలై దాదాపు ఐదేళ్లు గడిచినా చెక్కు చెదరకుండా అవార్డులను అందుకోవడం అభిమానులకు ఆనందాన్నిస్తోంది. ఇప్పటికైనా ఈ అవార్డుల సంప్రదాయం ప్రతి సంవత్సరం కొనసాగించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

నంది అవార్డులు - 2013

ఉత్తమ చిత్రం : మిర్చి
ద్వితీయ ఉత్తమ చిత్రం:నా బంగారుతల్లి
తృతీయ ఉత్తమ చిత్రం:ఉయ్యాల జంపాల
ఉత్తమ కుటుంబ కథా చిత్రం:సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం:అత్తారింటికి దారేది
ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం: అలియాస్ జానకి
ఉత్తమ డాక్యుమెంటరీ:్భరత కీర్తిమూర్తులు (ఎన్.గోపాలకృష్ణ)
ఉత్తమ విద్యాత్మక చిత్రం:విన్నర్
ఉత్తమ గ్రంథం:సినిమాగా సినిమా (నందగోపాల్)
ఉత్తమ పాత్రికేయుడు: వంశీకృష్ణ (పాలపిట్ట)
ఉత్తమ దర్శకుడు:దయా కొడవటిగంటి (అలియాస్ జానకి)
ఉత్తమ నటుడు:ప్రభాస్ (మిర్చి)
ఉత్తమ నటి:అంజలీ పాటిల్ (నా బంగారుతల్లి)
ఉత్తమ సహాయ నటుడు:ప్రకాష్‌రాజ్
(సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు)
ఉత్తమ సహాయ నటి:నదియా (అత్తారింటికి దారేది)
ఎస్.వి.రంగారావు స్మారక ఉత్తమ కేరెక్టర్ ఆర్టిస్ట్:నరేష్
(పరంపర)
అల్లురామలింగయ్య స్మారక హాస్యనటుడు:తా.రమేష్
(వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్)
ఉత్తమ విలన్:సంపత్‌రాజ్ (మిర్చి)
ఉత్తమ బాలనటుడు:మాస్టర్ విజయ్‌సింహారెడ్డి
(్భక్తశిరియాళ)
ఉత్తమ బాలనటి:బేబి ప్రణవి (ఉయ్యాల జంపాల)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు:కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత:మేర్లపాక గాంధీ
(వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్)
ఉత్తమ కథారచయిత:ఇంద్రగంటి మోహనకృష్ణ
(అంతకుముందు ఆ తర్వాత)
ఉత్తమ మాటల రచయిత:త్రివిక్రమ్ శ్రీనివాస్
(అత్తారింటికి దారేది)
ఉత్తమ పాటల రచయిత:సిరివెనె్నల సీతారామశాస్ర్తీ
(మరీ అంతగా- సీతమ్మ వాకిట్లో...)
ఉత్తమ కెమెరామెన్:మురళీమోహన్‌రెడ్డి
(కమలతో నా ప్రయాణం)
ఉత్తమ సంగీత దర్శకుడు:దేవిశ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది)
ఉత్తమ ఘంటసాల స్మారక గాయకుడు: కైలాష్ ఖేర్
(పండగలా దిగివచ్చాడు- మిర్చి)
ఉత్తమ గాయని:కల్పన
(నవమూర్తులైనట్టి- ఇంటింటా అన్నమయ్య)
ఉత్తమ ఎడిటర్:ప్రవీణ్‌పూడి (కాళీచరణ్)
ఉత్తమ కళాదర్శకుడు:ఎ.ఎస్.ప్రకాష్ (మిర్చి)
ఉత్తమ కొరియోగ్రాఫర్ :శేఖర్.వి.జె.
(గుండెజారి గల్లంతయ్యిందే)
ఉత్తమ ఆడియోగ్రాఫర్:ఇ.రాధాకృష్ణ (బసంతి)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్:తిరుమల
(శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య)
ఉత్తమ రూపశిల్పి:శివకుమార్ (శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్:యతిరాజ్ (సాహసం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్:చైతన్యకృష్ణ (కాళీచరణ్)
స్పెషల్ జ్యూరీ అవార్డ్:అంజలి (సీతమ్మ వాకిట్లో...)
స్పెషల్ జ్యూరీ అవార్డ్:రమ్య (ఓ మల్లి)
స్పెషల్ జ్యూరీ అవార్డ్:కల్కి మిత్ర (యుగమల్లి)
స్పెషల్ జ్యూరీ అవార్డు:సిద్ధిఖి (నా బంగారుతల్లి)