శభాష్ బేబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోగారి కూతురంటే ఎవరికైనా గౌరవమే. ఆమె హీరోయిన్‌గా మారితే మరింత గౌరవం దొరుకుతుంది. అలాంటిది ఇటీవల నటి భావనపై జరిగిన లైంగిక దాడి నేపథ్యంలో లైమ్‌లైట్‌లోకి వచ్చి మరీ తన గోడును వివరించింది తమిళ హీరో శరత్‌కుమార్ తనయ వరలక్ష్మి. అందరిలా తాను కూడా సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ధైర్యంగా చెప్పింది. అలా చేసేవాళ్లను శిక్షించాలని, అందరిలా ఓ మాట చెప్పి ఊరుకోకుండా, కార్యశూరురాలై రంగంలోకి దిగింది. ‘సేవాశక్తి’ అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టి సినీ పరిశ్రమలో మహిళా కళాకారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తోంది. అలాంటి కేసులు ఏమైనా కోర్టులో ఎదురైతే ఆరు నెలల్లోగా వాటిపై తీర్పులు వెలువడాలని, అలాంటి చట్టాలు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతులు పంపిస్తోంది. సినీ పరిశ్రమలో మహిళా కళాకారులు ఎదుర్కొంటున్న వేధింపులకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది. ఏదిఏమైనా వరలక్ష్మి నిర్వహిస్తున్న ఈ యజ్ఞంపై తమిళ సినీ పరిశ్రమలో మంచి ఆదరణ లభిస్తోంది. సో.. త్వరలో రాజకీయాలవైపు మొగ్గుచూపినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.