భిన్నమైన సినిమాలే చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దొంగాట’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వంశీకృష్ణ. ఆయన రెండో ప్రయత్నంగా రాజ్‌తరుణ్ - అనుఇమ్మాన్యుయేల్ జంటగా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీకృష్ణ చెప్పిన విశేషాలు...
నమ్మకం కలిగింది
సినిమా విడుదలకు ముందు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. కానీ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఈ రోజు ఆ నమ్మకం నిజమైంది. ఈ చిత్రంలో హీరో ఒక సమస్యల్లో ఇరుక్కుంటాడు. దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అవసరమైన డబ్బుకోసం కుక్కల్ని కిడ్నాప్ చేస్తుంటాడు. ఇందులో హీరో చెడ్డవాడుకాదు, మంచివాడే. నేను అనుకున్న పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు రాజ్‌తరుణ్. లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కుక్కల కిడ్నాప్ అంటే ప్రేక్షకులు మరోలా ఊహించుకుంటారేమో అనే అనుమానం ఉండేది. కానీ, సినిమాలో మంచి కథ, లవ్‌స్టోరీ, దాంతోపాటు ట్విస్ట్‌లు ఉంటాయి కాబట్టి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు అర్బాజ్‌ఖాన్ విలన్‌గా అదరగొట్టాడు.
బిన్నమైన సినిమాలే
నేను ఇంతకుముందు తీసిన ‘దొంగాట’ చిత్రం కిడ్నాప్ నేపథ్యంలో వుంటుంది. ఇదేమో లవ్‌స్టోరీ. నా తదుపరి చిత్రం స్పై థ్రిల్లర్‌గా రూపొందిస్తాను. నిజానికి నేను చెన్నైలోనే పుట్టిపెరిగాను. నాన్న ప్రొడ్యూసర్. దర్శకుడవ్వాలనే ఇండస్ట్రీలోకి వచ్చాను కానీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ నేర్చుకున్నాను. మంచు విష్ణు బ్యానర్‌లో నాలుగు సినిమాలకి పనిచేశా. అలాగే గౌతమ్‌వాసుదేవ్ మీనన్ వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాను. దర్శకుడనే వాడికి అన్నిరకాల శాఖలపైన పట్టు ఉండడం చాలా మంచిది. ఇక నా తదుపరి సినిమాకు కథలు రెడీగా వున్నాయి. నిర్మాత అనీల్ సుంకరకు రెండు కథలు చెప్పాను. దాంతోపాటు నానితో, శర్వానంద్‌తో ఒక సినిమా చేయాలని ఉంది.