అల్లరి అల్లుడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం తరువాత దర్శకుడు కళ్యాణకృష్ణ నేతృత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. దాదాపు ముగింపు దశలో వున్న షూటింగ్ పూర్తిచేసే పనిలోనే చిత్ర యూనిట్ మునిగిపోయింది. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకు మొదట ఆయన నటించిన ‘నినే్న పెళ్లాడుతా’ అనే టైటిల్‌ను పెడతారని ప్రచారం జరిగింది. అందరూ ఆ కథకు అదే యాప్ట్ అని కూడా అనుకున్నారు. దానికితోడు సోగ్గాడే చిన్నినాయనా దర్శకుడవ్వడంతో అదే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రానికి మరో టైటిల్ వినిపిస్తోంది. గతంలో నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ ఎంత విజయవంతమైందో తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో తాజా చిత్రానికి ‘అల్లరి అల్లుడు’ అనే పేరును ఖరారు చేశారని టాలీవుడ్ సమాచారం. కథ ప్రకారం ఈ పేరైతేనే వంద శాతం బాగుంటుందని సినిమా యూనిట్ భావిస్తోందట. త్వరలో నాగచైతన్య అల్లరి అల్లుడుగా మరోసారి తెలుగు ప్రేక్షకులకు వినోదం అందించనున్నాడన్నమాట!