అంజలి లేకుండా చిత్రాంగద లేదు.....దర్శకుడు అశోక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయగల దర్శకుడిగా పిల్లజమిందార్ సినిమాతో రుజువు చేసుకున్నాడు. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా ఆ కోణాన్ని మాత్రం వదిలేయలేదు. తాజాగా ఆయన హర్రర్ ఎంటర్‌టైనర్‌తో చిత్రాంగద చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 10న విడుదలవుతున్న సందర్భంగా అశోక్‌తో ఇంటర్‌వ్యూ...
సినిమా ఆలస్యమైనట్టుంది?
అదేం కాదు. నిజానికి కథ ప్రకారం 30 రోజులు అమెరికాలో షూట్ చేయాలి. దానికితోడు ఐస్ స్నో వుండే ప్రాంతం కావాలి కాబట్టి దానికోసం వెయిట్ చేశాం. తీరా ఆ సమయంలో షూటింగ్ చేయడంతో అంజలి కమిట్ అయిన వేరే సినిమాలు ఆగిపోయాయి. దాంతో ముందు ఆ సినిమాలు పూర్తిచేసి ఆ తరువాత చిత్రాంగదను చిత్రీరించాం. అమెరికా షూటింగ్ తరువాత గ్యాప్ రావడంతో టీజర్ విడుదల చేశాం. అందుకనే ఇంత గ్యాప్.
ఇంతకీ చిత్రాంగద ఎవరు?
భయపెట్టి ఎంటర్‌టైన్ చేస్తూ ఎమోషన్స్‌ను పండించగల ఓ ప్రధాన పాత్రను తీసుకుని రూపొందించిన చిత్రమిది. ఒక అమ్మాయికి అనుకోని పరిస్థితులు ఎదురైతే ఏం జరిగింది అనే కథతో రూపొందించాం. హారిజాంటల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మొదటి చిత్రమిదే.
చిత్రాంగద అంటే?
మణిపురిలో మహారాణిగా తిరుగులేని విజయాన్ని అందుకున్న రాణిపేరు చిత్రాంగద. అలాగే అర్జునునిపై యుద్ధానికి సిద్ధమైన అమ్మాయి పేరు చిత్రాంగద. చిత్రాంగద అంటే చూడ్డానికి అమ్మాయే అయినా అబ్బాయిలాంటి ధైర్యమున్నది అని అర్థం. అంటే.. మగరాయుడిలాంటి పాత్ర.
అంజలితోనే చేయడానికి కారణం?
ఈ కథ ప్రకారం అంజలి అయితేనే కరెక్ట్ అని అనిపించింది. పైగా పాత్రకు తగ్గ హావభావాల్ని అందించడమే కాకుండా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఒకరకంగా అంజలి లేకుంటే ఈ సినిమా ఉండేది కాదేమో. చాలా విషయాల్లో ఎంతో రిస్క్ చేసి నటించింది. ముఖ్యంగా అమెరికాలో మైనస్ 11 డిగ్రీల్లో మాడ్రన్ డ్రెస్ వేసుకుని షూటింగ్ చేయడం మామూలు విషయం కాదు. ఈ సినిమాలో అంజలి అల్ట్రా మోడరన్ గ్లామర్ గాళ్‌గా కనిపిస్తుంది.
సినిమాలో హైలెట్స్?
ఇది హారిజాంటల్ థ్రిల్లర్ కాబట్టి చూస్తున్న ప్రతి ఫ్రేమ్ కూడా ఆసక్తికల్గిస్తోంది. ముఖ్యంగా థ్రిల్లర్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో అంజలి పాత్ర భిన్నమైన షేడ్స్ కన్పిస్తుంది. ముఖ్యంగా రెండు డైమెన్షన్లలో ఈ పాత్ర సాగే విధానం కొత్తగా వుంటుంది. దానికితోడు రీకార్డింగ్, ఫొటోగ్రఫి, ఎడిటింగ్.. అన్ని అంశాలు హైలెట్‌గా నిలుస్తాయి.
తెలుగు తమిళంలో విడుదల చేస్తున్నారా?
ఈ చిత్రాన్ని రెండు భాషల్లో రూపొందించాం. తమిళంలో యార్‌ని పేరుతో రెండు వారాల తరువాత విడుదలవుతుంది. ఈ తెలుగులో మాత్రం ఈనెల 10న సుర ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్లు భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేశారు.
పిల్లజమిందార్ లాంటి హ్యూమన్ ఎమోషన్ సినిమాలు చేసే మీరు, సడెన్‌గా హర్రర్ వైపుకు వచ్చారు ఎందుకు?
దర్శకుడన్నాక అన్ని రకాల సినిమా లు చేయాలి. ఇందులో కూడా మంచి హ్యూమన్ ఎమోషన్ వుం టుంది. కానీ థ్రిల్లింగ్ అంశాలతో జోడించాం కాబట్టి థ్రిల్లర్‌గా వచ్చింది.
మరి అనుష్క బాగ్‌మతి గురించి?
దాదాపు షూటింగ్ పూర్తయింది. మరో పది రోజుల్లో చిత్రం మొత్తం కంప్లీట్ అవుతుంది. బాగ్‌మతి సినిమా అనగానే భాగమతి బయోపిక్ కాదు. కొత్త జోనర్‌లో తెరకెక్కిన చిత్రమిది. అనుష్క పాత్ర ఆకట్టుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌లో సెట్ వేశాం. బాగ్‌మతి చిత్రాన్ని 11 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారెందుకు?
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అనేకంటే హీరోయిన్ ప్రధాన సినిమాలంటేనే బెటరేమో. ఈ మధ్య ఈ తరహా సినిమాలకు ప్రజాదరణ పెరిగింది. మన ఇండియాలోనే ఈ తరహా సినిమాలతో హీరోయిన్లు వెయ్యి కోట్ల మార్కెట్‌ను సాధించారు. కాబట్టి ప్రేక్షకులు ఈ తరహా సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
బాగ్‌మతి విడుదల ఎప్పుడు?
ప్రస్తుతం వర్క్ జరుగుతోంది. విడుదల గురించి త్వరలో ప్రకటిస్తాం.
తదుపరి చిత్రాలు?
బాగ్‌మతి తరువాత కథలు రెడీగా ఉన్నాయి. త్వరలోనే వాటి గురించి తెలియజేస్తా.

- శ్రీ