టిఎస్‌ఆర్ 2015-16 అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఏడాది అందిస్తున్న టిఎస్‌ఆర్-టివి9 అవార్డుల వేడుక ఈ ఏడాదికిగాను ఇవ్వడానికి సన్నాహాలు జరుపుతున్నారు. 2015-2016 సంవత్సరానికిగాను ఇచ్చే అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ ప్రకటన హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి, జయసుధ, మీనా, బి.గోపా ల్, జీవిత, పింకీరెడ్డి, పివిపి, రఘురామ కృష్ణంరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ- కళాకారులంటే నాకెంతో అభిమానం. వాళ్లను సత్కరించడం ద్వారా నాకెంతో ఆత్మ సంతృప్తి లభిస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టి.ఎస్.ఆర్-టివి9 అవార్డులను నిర్వహిస్తున్నాం. అందుకు ప్రతి కేటగిరిలో ఓ సినిమాను ఎంపిక చేశాం. మార్చి 8 నుండి నెలరోజులపాటు జరిగే ఎస్‌ఎంఎస్ పోల్స్ ద్వారా ప్రేక్షకులు తమకు నచ్చినవారిని ఎన్నుకోవచ్చు. ఈ వేడుకను విశాఖలో భారీ గా నిర్వహిస్తామన్నారు. జయసుధ మాట్లాడుతూ- ప్రతి ఏడాది ఈ అవార్డు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా వైజాగ్‌లో అంతకంటే ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నాము. ప్రేక్షులు తమ కు నచ్చినవారికి ఓటువేసి సపోర్టు చేయాలి అన్నారు.