పట్టుజారిపోతావుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ దేశంలోనైనా సంస్కృతీ సంప్రదాయాలు సరైన పద్ధతుల్లో విలసిల్లిన నాడే ఆ దేశ నాగరికత అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అని పెద్దలు చెప్పినట్లుగ్ఘా -గత కాలం మేలు వచ్చు కాలము కంటెన్ అన్న రీతిలో నేటి సినిమా పరిశ్రమ సాగుతోంది. రోజురోజుకీ ఆ అందాల రాశి అందం మంచు కరిగినట్లు కరిగిపోతోంది. స్వర్ణయుగంనాటి సినిమాలు పోయి ప్లాస్టిక్ యుగం లాంటి సినిమాలు వస్తున్నాయి. ఎప్పుడు పెళుసుబారి విరిగిపోతాయో తెలియని ప్లాస్టిక్ సంస్కృతి సినిమాల్లో వేళ్లూనుకుపోయింది. మంచి సినిమాలు అనబడే మాట ఇప్పుడు బ్రహ్మపదార్థమైంది. ఒకవేళ ఎవరైనా అలాంటి సినిమాలు తీయాలనుకున్నా మిగతా వాళ్లు నవ్వేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ చిత్రాన్ని రూపొందించిన హీరో చెప్పాడు. తాను ధైర్యం చేసి ఆ సినిమాను చేయడానికి ముందుకు వచ్చానని, అందరూ నన్ను పిచ్చోడు అని ఎద్దేవా చేశారని ఆయన చెప్పుకొచ్చాడు. నిజమే, ధనం సంపాదించలేని కళ వ్యర్థమని భావించే నిర్మాతలున్న నేటి కాలంలో మంచి చిత్రాలు తీయడమనేది ఓ సాహసమే! మంచి కథలు దొరికినపుడు ఆయా దర్శక నిర్మాతల అభిరుచిని బట్టి ఆ సినిమా అద్భుతమైన సినిమాగా రూపొందుతుంది. ఒక్కొక్కసారి మంచి కథ దొరికినా దర్శక నిర్మాతలకు సరైన టేస్ట్ లేకపోతే ఆ సినిమా కుదేలైపోతుంది. ఈ మాటలను సమర్థించడానికి తెలుగులో అనేక చిత్రాలను ఉదహరించవచ్చు. కథ, కథనాల విషయం గురించి చెప్పుకుంటే అదో పెద్ద గ్రంథమే అవుతుంది. ప్రస్తుతం పట్టుజారిపోతావుంది అననంటే అదేదో వేటూరి గీతం కాదు. తెలుగు సినిమాలో తెలుగు భాషపై నటీనటులకు పట్టు జారిపోతూ వుంది అని అర్థం. తెలుగు భాషను ఖూనీ చేసి మాట్లాడే నటీనటులు పుట్టుకొచ్చారు ప్రస్తు తం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అలనాటి అభినేత్రి వాణిశ్రీ చెప్పినట్లుగా తెలుగు పలకడమే రాని తెలుగు నటులు ఇప్పుడు రాజ్యమేలుతున్నారని, వారి నటన, డైలాగులు చెప్పే విధానంలో తెలుగు సినిమాల పట్ల అశనిపాతంగా మారిందని వారు ఆవేదన వెలిబుచ్చారు. రాధా అన్న మాట పలకడం రానివారు చాలామంది వున్నారు. ఒత్తు లేకుండా రాదా.. రాదా అనేవాళ్లే చాలామంది కనిపిస్తున్నారు. కేవలం తెలుగు పాండిత్యం ఇక్కడ నటీనటులకు అవసరం లేదు. వారు తెలుగును కచ్చితమైన ఉచ్ఛారణతో పలకగలిగితే చాలని తెలుగు భాషాభిమానులు కోరుకుంటున్నారు. కానీ తెలుగు డైలాగులు రాసేవారికి సరైన అవగాహన లేనప్పుడు ఆయా నటీనటులు మాత్రం ఏం చేస్తారు. అయినా కానీ దర్శకుడికి, నిర్మాతకు కూడా భాషపై పట్టు వుండాలి. అది కూడా ఇక్కడ మైనస్‌గా మారడంతో ఏ భాషకు సం బంధించిన సినిమా తీస్తున్నారో వారికి కూడా తెలియడంలేదు. ఇప్పుడొస్తున్న చిత్రాలలో 90 శాతం యువతీ యువకుల కథలపై చిత్రీకరిస్తున్నవే. ఆ సినిమాలలో కథనం అంతా కాలేజీ నేపథ్యంలోనే సాగుతున్నాయి. కాలేజీ అంటే దాదాపుగా ఇంగ్లీషు పదాలే వారి డైలాగులుగా మారుతున్నాయి. దానికితోడు ఆయా నటీనటులు చిన్నప్పటినుండీ ఇంగ్లీషు మీడియంలో చదవడంవల్ల తెలుగు భాషను కచ్చితంగా పలకలేకపోతున్నారు. ఇది భవిష్యత్తు తరాల తెలుగు భాషకు కూడా గొడ్డలిపెట్టుగా మారుతోంది. పరభాషా నటులను మనవారు స్వాగతిస్తున్నారు. ఇది మంచిది అని దర్శక నిర్మాతలు వాదిస్తుంటే, తెలుగు నటులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తమకు కొన్ని పాత్రలను ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అయినా కానీ వారిది అరణ్యరోదనే. పాత్రకు తగిన నటుణ్ణి ఎంపిక చేస్తున్నామని ఆయా దర్శక నిర్మాతలు చెప్పేది నిజమే అయినా, కేవలం నటుడి స్థాయిని మాత్రమే ఇక్కడ చూడకుండా, వారికి తెలుగు భాషపై పట్టు దొరికేలా కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఆయా దర్శక నిర్మాతలకు వుంది. కేవలం సినిమా త్వరత్వరగా ముగించేయాలి, లాభాలు పట్టేయాలి అన్న ధ్యాసతో పరభాషా నటులకు తెలుగు భాషపై ఎటువంటి శిక్షణ ఇవ్వకపోవడంతో వారు ఎలా మాట్లాడుతున్నారో ప్రేక్షకులు గమనిస్తూనే వున్నారు. అయినా కానీ పరభాషా నటులు తెలుగెందుకు మాట్లాడతారు? వారి కి డబ్బింగ్ చెప్పిస్తున్నాం కదా! అని దర్శక నిర్మాతలు తమ తప్పుకు సమాధానం చెప్పుకోవచ్చు. కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఇక్కడ దీనికి మినహాయింపు కాదు. వాయిస్ బాగుందని పరభాష డబ్బింగ్ ఆర్టిస్టులను తెచ్చి ఇక్కడ చెప్పిస్తున్నారు. దానికితోడు టీవీ మాథ్యమంలో చిలక పలుకులు పలికే యాంకర్లచేత డబ్బింగ్‌లు చెప్పిస్తున్నారు. వినడానికి బాగానే వున్నా అవి ఒక్కొక్కసారి తెలుగు భాషాభిమానులకు ఏవగింపు కలిగిస్తున్నాయి. రియాలిటీ షోలలో తెలుగును ఎంత బాగా ఖూనీచేసి మాట్లాడితే అంత బాగా టిఆర్‌పి రేటింగ్స్ వస్తున్నాయని ఆయా చానల్స్‌కూడా తెలుగు భాషపై శీతకన్నువేసింది. దీంతో కర్ణుడి చావుకు శతకోటి కారణాలు అన్నట్లు తెలుగు చిత్రాలలో తెలుగు భాష తిరోగమనానికి ఎన్నో దారులు కనిపిస్తున్నాయి. ఏ దారుల్లో ఎటువెళ్లినా, పరభాషానటులు తెలుగు సినిమాల్లో నటించినా వారి డైలాగుల్లో స్వచ్ఛమైన తెలుగు వినిపించేలా దర్శక నిర్మాతలు ప్రయత్నించాలని తెలుగు సినీ అభిమానులు కోరుతున్నారు. టీవీ మాథ్యమంలో వినిపించే తెలుగును నిషేధించాలని కోరుతున్నారు. ఇందుకు తెలుగు భాషాభివృద్ధి స మితి కూడా నడుం కట్టి పనిచేయాలి. అప్పుడేకొద్దో గొప్పో తెలుగు చిత్రాల్లో తెలుగు వినిపిస్తుంది, కనిపిస్తుంది.

- యు