నెగెటివ్ పాత్రలో కేథరిన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో రానాపై హీరోయిన్ కేథరిన్ ఎందుకు పగ తీర్చుకుంటుంది? ఇంతకి రానా ఏమి చేశాడు? అంటూ ఏదేదో ఊహించేసుకోకండి. ఆమె పగ తీర్చుకుంటానని చెప్పింది సినిమాలో, నిజంగా కాదు?! ఆ వివరాల్లోకి వెళితే.. గ్లామర్ భామ కేథరిన్‌కు లేటెస్టుగా ‘సరైనోడు’ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ దక్కింది. ఇక కొద్దిలో మెగాస్టార్ 150వ సినిమాలో ‘రత్తాలు.. రత్తాలు’ ఐటెం సాంగ్ మిస్ అయిన ఈ అమ్మడు ప్రస్తుతం రానా హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేథరిన్ నెగటివ్ రోల్‌లో కనిపిస్తుందట! హీరో రానాపై పగ తీర్చుకునే అమ్మాయిగా కనిపిస్తుందని, గ్లామర్‌తోపాటు నటనకు స్కోప్ వున్న పాత్ర దక్కడంతో హ్యాపీగా ఫీల్ అవుతోందట. హీరోయిన్ నెగిటివ్ అయినా తరువాత రియలైజ్ అయి మళ్లీ హీరోను లవ్ చేయడం కామనే కదా! అయితే ఈ సినిమాలో కేథరిన్ పాత్ర చివరివరకూ అలాగే ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది.