17న వెళ్లిపోమాకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ‘వెళ్లిపోమాకే’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని ఇటీవలే హైదరాబాద్‌లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. మార్చి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని తొలుత భావించినప్పటికీ, ఈ చిత్రాన్ని ఇప్పుడు మార్చి 17న విడుదల చేయాలనీ నిర్ణయించారు. నిర్మాత రాజు మాట్లాడుతూ- ‘వెళ్లిపోమాకే’ సినిమా మేకింగ్ చాలా బాగా వచ్చింది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని దర్శకుడు యాకూబ్ అలీ చక్కగా చేశాడు. విశ్వక్‌సేన్ సహా ఏడెనిమిది క్యారెక్టర్స్ మధ్య సాగే ఫీల్ గుడ్ మూవీ. యాకూబ్ అండ్ టీం కలిసి కొత్తగా చేసిన ప్రయత్నమే ‘వెళ్లిపోమాకే’. దర్శకుడు నటీనటులనుండి పెర్‌ఫార్మెన్స్‌ను రాబట్టుకున్న తీరు బాగా నచ్చింది. హీరో విశ్వక్‌సేన్ అనుపమ్‌ఖేర్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాడు. అలాగే డైరెక్టర్ యాకూబ్ అలీ రామానాయుడు స్టూడియోలో దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి ఎ.ఆర్.రెహమాన్ మూజిక్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. మార్చి 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. దర్శకుడు యాకూబ్ అలీ మాట్లాడుతూ- ఈ సినిమాను రెండున్నర సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాము. నాకున్న బడ్జెట్ పరిమితుల్లో, వనరులతో చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమా నచ్చి రాజు సినిమాను విడుదల చేద్దామనే ఉద్దేశ్యంతో ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.