17న మా అబ్బాయి వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవిష్ణు హీరోగా రూపొందిన ‘మా అబ్బాయి’ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమవుతోంది. వెనె్నల క్రియేషన్స్ పతాకంపై కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత బలగ ప్రకాష్‌రావు మాట్లాడుతూ- అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. కుటుంబ సమేతంగా చూడదగ్గ అంశాలన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. దర్శకుడు కుమార్ వట్టి కొత్తవాడైనా, అనుభవజ్ఞుడిలా మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు అని చెప్పారు. దర్శకుడు వట్టి మాట్లాడుతూ- ఈ సినిమాలో లవ్, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది అని తెలిపారు. శ్రీవిష్ణు, చిత్రశుక్ల జంటగా నటించారు.