వేశ్య పాత్రలో విద్యాబాలన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనకోసమే కథలు రాసుకునే రేంజ్ విద్యాబాలన్‌ది. దర్శక, రచయితలు ఆమెను దృష్టిలో పెట్టుకుని స్టోరీలు రాస్తుంటారు. ఇటీవలి ‘కహానీ’ సిరీస్ ఆ కోవలో వచ్చినదే. ‘కహానీ’, ‘కహాని 2’ బాలన్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అదే కోవలో మరో నటనా ప్రాధాన్యమున్న సినిమాలో నటిస్తోంది బాలన్. ‘బేగం జాన్’ అనేది తాజా సినిమా టైటిల్. దేశ విభజన సమయంలో వేశ్యలుగా మారిన బెంగాలీల జీవిత కథల్ని టచ్ చేస్తూ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మూవీ ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో వేశ్య పాత్రలో విద్యాబాలన్ లుక్ ఫెంటాస్టిక్ అన్న పేరొచ్చింది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో బెంగాలీ మూవీ రాజ్‌కహిని ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. ఏప్రిల్ 14న సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.