17న ఏటిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్, కారుణ్య, రాకేష్ ప్రధాన తారాగణంగా శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏటిఎం వర్కింగ్’. కిషోర్‌బసిరెడ్డి, యక్కలి రవీంద్ర సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తీసిన సినిమా కాదని, ఓ మంచి ప్రేమకథా చిత్రంగా రూపొందించామని, నోట్ల రద్దువల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ చిత్రంలో షూట్‌చేశామని, ఏడిఎం నాట్ వర్కింగ్ అనే పేరును తాము నిర్ణయిస్తే సెన్సార్‌వాళ్లు అభ్యంతరం చెప్పడంతో నాట్‌ను తొలగించి, ఏటిఎం వర్కింగ్ పేరును ఖరారు చేశామని తెలిపారు. బర్నింగ్ పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయని, పూర్తిస్థాయి కామెడీ ఉంటుందని వారన్నారు. భారతీయులు ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద డాక్యుమెంట్ చేద్దామని సరదాగా ఈ సినిమా చేశామని, రియాలిటీగా ఉంటుందని, తాము దేనికీ వ్యతిరేకం కాదని, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గురించి చెప్పామని, అనంత్, త్రిలోక్, మహేశ్ అనే ముగ్గురు కుర్రాళ్ల కథనంగా సినిమా సాగుతుందని, ఏటిఎం క్యూలో జరిగే కథను జనం నుంచి జనం చుట్టూ జరిగే విషయాలను తీసుకుని చిత్రం చేశామని దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రెండు గంటలు వినోదం గ్యారంటీ అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బాపిరాజు తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. మహేందర్‌రెడ్డి, నారాయణ, ఆశ, మహేష్, అంబటి శ్రీను, కిషోర్‌దాస్, తిరుపతి దొరై, వీరబాబు, చిల్లర రాంబాబు, ఆంజనేయులు తదితరులు నటించారు.