మహానటి ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్‌లో విడుదలైన ఓ పోస్టర్ సంచలనం రేపుతోంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో ప్రశంసలందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ‘మహానటి’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావచ్చిన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశాడు. సావిత్రితోపాటు సమంత, కీర్తి సురేష్‌ల ఫొటోలతో వున్న పోస్టర్ సంచలనం రేపుతోంది. ఈ ఇద్దరిలో మహానటి ఎవరు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో రేకత్తిస్తోంది. దానికితోడు తరాలను నిర్మించే స్ర్తి జాతికోసం తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్ర పోషిస్తోండగా, సమంత మరో కీలక పాత్రలో కన్పిస్తుందట. త్వరలోనే దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.