కోపమొచ్చింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం కోలీవుడ్‌లో సుచి లీక్స్ సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరో హీరోయిన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయి హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల వీడియోలు లీక్ చేసి వారి కెరీర్‌కి మాయనిమచ్చగా మారనున్నాయి. ఇంతకీ ఈ ఫొటోలు లీక్ చేస్తున్నది ఎవరూ అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ గాయని, నటి సుచిత్ర ఈ వీడియోలను లీక్ చేస్తుందంటూ విమర్శలు వస్తుండగా, తన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారంటూ సుచిత్ర చెబుతోంది. ఏదేమైనా సెలబ్రిటీల వీడియోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా ఈ విషయంపై సదరు నటీనటులు ఎవరూ నోరు మెదపకపోవడం విశేషం. కానీ ఈ విషయంపై అందాల భామ త్రిష మాత్రం ఘాటుగా స్పందించింది. ఈ విషయంపై ట్విట్టర్‌లో ఫైర్ అయింది. ముఖ్యంగా కర్మ గురించి ఈమె ట్వీట్ చేస్తూ పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కూర్చుని విశ్రాంతిగా చూస్తూ ఉండండి. మిమ్మల్ని బాధపెట్టినవారు వారంతటవారు నాశనమైపోతారు. మీకు అదృష్టం వుంటే వాళ్ల నాశనాన్ని మీ కళ్లతో చూసే అవకాశాన్ని దేవుడు మీకిస్తాడని ట్వీట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే త్రిషకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీక్ చేయడంతోనే ఇలా త్రిష ఫైర్ అయ్యిందని అంటున్నారు సినీ జనాలు.