మహేష్ ఫస్ట్‌లుక్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రిన్స్ మహేష్‌బాబు కథానాయకుడిగా రూపొందుతున్న 23వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సినిమా మొదలై దాదాపు ఏడాది కావస్తున్నా ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమూ ఇంతవరకూ బైటికి రాలేదు. పేరు ఏం పెడతారోనన్న ఆసక్తితో మహేష్‌బాబు అభిమానులు కూడా ఉత్కంఠగా కూడా ఉన్నారు. రకరకాల టైటిల్స్ ప్రచారంలో వచ్చాయి. ఆమధ్య మర్మం అనే పేరు పెడుతున్నట్లుక కూడా వచ్చింది. మొత్తానికి ఇన్ని రకాల టైటిల్స్ విని విసిగిపోయిన ప్రేక్షకులకు ఆశ్చర్యకరమైన వార్త ఏమిటంటే, ఈ సినిమా ఫస్ట్‌లుక్ రేపు విడుదల చేస్తారని. టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి ఉగాది కానుకగా టీజర్‌ను కూడా విడుదల చేస్తారట. ఫస్ట్‌లుక్ విడుదలకానున్న ఈ సినిమాకు అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోతోంది. జూన్ 23న సినిమా విడుదల చేస్తారట.