మలయాళ నిర్మాతతో భావన నిశ్చితార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీనటి భావన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మలయాళ నిర్మాత నవీన్‌తో గురువారం అతికొద్ది మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. మూవీ ట్రాకర్ రమేష్ బాల ఈ విషయాన్ని నిర్ధారిస్తూ భావన నిశ్చితార్థం ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తెలుగులో ‘మహాత్మ’, ‘నిప్పు’, ‘ఒంటరి’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే కొద్దిరోజుల క్రితం కేరళలో ఆమెపై లైంగికదాడి జరగడంతో అందరూ ఆవేదనకు గురయ్యారు.
సినీవర్గాలు ఆమెకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా నవీన్ తనకు చాలాకాలంగా తెలుసునని, 2014లోనే వివాహం చేసుకోవాలనుకున్నామని, అయితే సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల వాటికి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లూ ఆగామని భావన పేర్కొన్నట్లు రమేష్ తెలిపారు. వివాహం ఎప్పుడు జరిగేదీ ఇంకా చెప్పలేదు. 2002లో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన భావన తక్కువ సమయంలోనే పేరుతెచ్చుకుంది. పరిమళమ్ చిత్రంలో నటనకు గాను కేరళ ప్రభుత్వ జ్యూరీ అవార్డును సొంతం చేసుకుంది. కొంతకాలంగా నిర్మాత నవీన్‌తో ప్రేమలోపడిన భావన ఇప్పుడు నిశ్ఛితార్ధం చేసుకుంది. ఆమె శ్రేయోభిలాషుల మధ్య నిరాడంబరంగా ఈ వేడుక నిర్వహించారు.