సిద్ధమైన శివకాశీపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేష్, శ్రీచక్రవర్తి, ప్రియాంకా శర్మ నాయికా నాయకులుగా సాయి హరీశ్వర్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీశ్ వట్టికూటి దర్శకత్వంలో మోహన్‌బాబు పులిమామిడి రూపొందిస్తున్న చిత్రం ‘శివకాశీపురం’. ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ మాట్లాడుతూ- ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా వైవిధ్యమైన కథనంతో సాగుతుందని తెలిపారు. గతంలో షార్ట్ఫిలింస్ చూసి నిర్మాత ఈ అవకాశం ఇచ్చారని, దాన్ని తాను వందశాతం వినియోగించుకున్నానని తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా రూపొందిస్తున్నామని, తమిళ వెర్షన్‌లో గ్రాండియర్ లుక్‌తో రూపొందిన ఈ సినిమా తెలుగులో కూడా అంతే ఆదరణ పొందుతున్న నమ్మకం వుందని నిర్మాత తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. దిల్ రమేష్, చమ్మక్ చంద్ర, రాము, నవీన్, కల్యాణి, సత్యప్రియ, రవీంద్ర, వైజాగ్ రవి నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:పవన్‌శేష, కెమెరా:జయ జి.రాంరెడ్డి, ఎడిటింగ్:జియోథామస్, నిర్మాత:మోహన్‌బాబు పులిమామిడి, రచన, దర్శకత్వం:హరీశ్ వట్టికూటి.