భారత సరిహద్దులో మేజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి సమస్యకి యుద్ధం సమాధానం కాదు. యుద్ధం లేని ప్రపంచాన్ని చూడాలనుకునే ఓ మేజర్ కథే ఈ 1971 భారత సరిహద్దు చిత్రం. 1971వ సంవత్సరంలో పాకిస్తాన్‌కి, భారతదేశానికి మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ కథాంశం నడుస్తుంది. అంతేకాదు, ఆ యుద్ధం జరిగిన ప్రదేశంలోనే ఈ చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. రియల్‌గా యుద్ధ ట్యాంకర్స్‌ని వాడి షూట్ చేశారు. బోర్డర్‌లోని ప్రతి సైనికుడు తమ కర్తవ్యాన్ని దైవంలా భావించి వారి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా దేశ రక్షణ కోసం ఎలా పనిచేస్తారనేది ఈ చిత్రంలోని ముఖ్య కథాంశం. ఈ చిత్రాన్ని మలయాళంలో మంచి చిత్రాల దర్శకుడు, నటుడు, అంతకుమించి మాజీ భారత సైనికాధికారి మేజర్ రవి దర్శకత్వం వహించారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో అల్లు శిరీష్ నటించారు. ఈ చిత్రం మొదటి లుక్‌ని అతి త్వరలో విడుదల చేయనున్నారు. భారతదేశంలో అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రతి భారతీయుడు చూడవలసిన, తెలుసుకోవలసిన చిత్రం ఈ 1971 భారత సరిహద్దు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ శ్రీనివాస్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై పూజా కాత్యాయని నిర్మిస్తున్నారు.