భయపెట్టే షాలిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమోగ్ దేశపతి, అర్చన ముఖ్యపాత్రల్లో షెరాజ్ దర్శకత్వంలో స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘షాలిని’. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత సాయి వెంకట్ టీజర్‌ను ఆవిష్కరించాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ- సినిమా బాగా వచ్చిందని, ముఖ్యంగా టీజర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి కలుగుతోందని, ఇదొక మంచి హారర్ థ్రిల్లర్ అని అన్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు షెరాజ్‌తో అవినీతిపై ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నానని అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ- హారర్ సినిమాలను ఆదరిస్తున్న ఈరోజుల్లో షాలిని వంటి మంచి చిత్రం రావడం, సరికొత్త కథ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. చిత్ర నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ తనకు కృష్ణ అంటే చాలా అభిమానమని, ఆయన స్ఫూర్తితోనే నిర్మాతగా మారానని అన్నారు. దర్శకుడు షెరాజ్ మాట్లాడుతూ, దెయ్యానికి ఒక రూపం ఉండదని చెప్పే చిత్రమిదని, చిన్న సినిమాలకు ఎలాంటి కష్టాలుంటాయో అందరికీ తెలుసు. మంచికథతో మంచి సినిమా చేశామని, తప్పకుండా మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు.