కబీర్‌బేడీ మళ్లీ పెళ్లికొడుకాయెనె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి బాలీవుడ్ నటుడు కబీర్‌బేడీ 70 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లికొడుకయ్యాడు. పదేళ్లుగా సహజీవనం చేస్తున్న స్నేహితురాలు పర్వీన్ దుసాంజీని (42) ఆయన వివాహం చేసుకున్నారు. ఇది ఆయనకు నాలుగో వివాహం. ప్రఖ్యాత ఒడిస్సీ డాన్సర్ ప్రొతిమను మొదట ఆయన వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన పిల్లలే పూజ, సిద్దార్థ్. వీరు బాలీవుడ్‌లో రాణించారు. ఇక రెండోభార్య బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ సుసాన్ హమ్‌ఫ్రేస్ కాగా వీరి కుమారుడు అడమ్స్. టివి, రేడియో కార్యక్రమాల ప్రజెంటర్‌గా పేరుపొందిన నిక్కీబేడీ ఆయన మూడో భార్య. విడాకులతో ఆ బంధాలను వద్దనుకున్న కబీర్‌బేడీ తన 70వ పుట్టినరోజైన జనవరి 16వతేదీకి ఒక్కరోజు ముందు ఈ నాల్గవ వివాహం చేసుకున్నాడు. బాలీవుడ్ ప్రముఖుడు గుల్షన్ గ్రోవర్‌సహా పలువురు ఆయనను అభినందించారు.