కాశీ నేపథ్యంలో యాత్రికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నటరాజ లక్ష్మీనరసింహ స్వామి మూవీస్ పతాకంపై వారణాసి సూర్య దర్శకత్వంలో యు.వేదప్రకాష్ నిర్మిస్తున్న ‘యాత్రికుడు’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్‌ను పోచారం భాస్కర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణగౌడ్, కె.వి.మోహన్‌గౌడ్, సురేష్ కొండేటి, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- ట్రైలర్ బాగుంది. ముఖ్యంగా సినిమాలో ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమాకు మా పూర్తి సహకారాన్ని అందించి చిన్న సినిమాను పెద్ద స్థాయిలో విడుదల చేయడానికి కృషిచేస్తామన్నారు. పోచారం భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ- మేకింగ్ బాగుంది. ఇంత మంచి చిత్రాన్ని తీసిన దర్శక నిర్మాతలకు మంచి విజయం దక్కాలి అన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ- కాశి నేపథ్యంలో తీసిన సినిమా ఇంద్ర పెద్ద సంచలన విజయం సాధించింది. ఆ స్థాయిలోనే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావాలి అన్నారు. దర్శకుడు సూర్య మాట్లాడుతూ- అందరి సహకారంతోనే అనుకున్న విధంగానే సినిమాను పూర్తిచేశాం. సినిమాకి మంచి టెక్నీషియన్స్ దొరికారు అన్నారు. నిర్మాత వేదప్రకాష్ మాట్లాడుతూ- కొరియోగ్రాఫర్ అయిన నేను నిర్మాతగా మారి చేస్తున్న తొలి ప్రయత్నమిది. మంచి కథతో తెరకెక్కిన ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులు చూసి ఆదరించాలి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:రామ్‌పైడిశెట్టి, కెమెరా:్ఫణీంద్ర వర్మ, ఎడిటింగ్:ఉదయ్ మాడుపూరి, సహ నిర్మాత:రామ్మూర్తి, నిర్మాత:వేదప్రకాష్, దర్శకత్వం:వారణాసి సూర్య.