మణిరత్నంతో చరణ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది ‘ధ్రువ’ సినిమా ఘనవిజయంతో మంచి జోరుమీదున్నాడు రామ్‌చరణ్. ఈ సినిమాతోపాటు ఆయన నిర్మించిన ఖైదీ నెం 150వ చిత్రం సంచలన విజయం సాధించి 100 కోట్ల మార్కెట్‌ను కొల్లగొట్టడంతో మళ్లీ చిరంజీవితో రెండవ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న చిత్రం ఈనెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రం ఎలా వుంటుందో అని మెగా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్ డ్రీమ్ ప్రాజెక్టు పట్టాలపైకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. సంచలన దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే చరణ్‌తో చర్చలు జరిపారు.
దాంతోపాటు స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్పీడ్‌గా జరుపుకుంటోంది. మణిరత్నంతో సినిమా చేయడానికి హీరోలు పోటీపడుతుంటారు. అలాంటి అరుదైన అవకాశాన్ని అందుకున్న చరణ్, సినిమా కోసం అంతే జోష్‌తో సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని జూన్‌లో సెట్స్‌పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. మణిరత్నం స్వయంగా నిర్మించనున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి కూడా నటిస్తాడని తెలిసింది. మద్రాస్ టాకీస్ పతాకంపై రూపొందే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.