పెళ్లికళ వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్‌కపూర్ గత కొంతకాలంగా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో ప్రేమలో పడ్డట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ అలాంటిదేం లేదంటూ దాటేస్తున్న సోనమ్, ఈమధ్యే అతగాడితో షికార్లు చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. చేసేదేమీ లేక ఔను, మా ఇద్దరిమధ్యా ప్రేమాయణం సాగుతోందని చెప్పేసింది. ఇక ఘాటు ప్రేమాయణంలో వున్న వీరిద్దరూ త్వరలోనే ఒకటయ్యేందుకు ఇరు కుటుంబాలవారు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. సోనమ్‌కపూర్ ఇంట్లో మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట. ఈ ఏడాది చివరిలో వీరి పెళ్లి జరుగుతుందని సోనమ్‌కపూర్ తల్లి సునీత మీడియాకి తెలిపింది. ప్రస్తుతం సోనమ్‌కపూర్ సినిమా కెరీర్ అంతంతమాత్రంగానే ఉంది. గ్లామర్‌ను నమ్ముకుని సినిమాలు చేసినా కూడా ఈ అమ్మడికి పెద్దగా కలిసిరావడంలేదు. ప్రస్తుతం సంజయదత్ జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. దాంతోపాటు ప్యాడ్‌మాన్ చిత్రంలో అక్షయ్‌కుమార్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.