నగరంలో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్, శ్రీ, రెజీనా హీరో హీరోయిన్లుగా లోకేష్ దర్శకత్వంలో ఎ.కె.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్స్, పొటెన్షియల్ స్టూడియో బ్యానర్‌లపై తెరకెక్కిన నగరం చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో హీరో సందీప్‌కిషన్ మాట్లాడుతూ- రెండు సంవత్సరాలు కష్టపడి చేసిన సినిమా ఇదని, వేరే సినిమా చేస్తున్నందువల్ల ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొనలేకపోయానని, విడుదలైన అన్ని కేంద్రాలలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. ముఖ్యంగా తమిళంలో అద్భుతమైన రెస్పాన్స్ రావడమే కాకుండా నా కెరీర్‌లో బెస్ట్ చిత్రంగా నిలిచిందని, ఇలాంటి మంచి సినిమా నా బాధనంతా తీర్చేసిందని ఎందుకంటే, గత రెండేళ్లుగా నాకు సరైన విజయం లేక చాలా టెన్షన్ పడ్డానని, ఈ సినిమాతో మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నాడు. దర్శకుడు లోకేష్ మాట్లాడుతూ- సినిమా సక్సెస్‌పై నమ్మకముందని, కానీ ఇంత భారీ విజయాన్ని ఊహించలేదని, ఈ సినిమా చేయకముందు కొన్ని షార్ట్ఫిలిమ్స్ చేశానని అన్నారు. మరో హీరో శ్రీ మాట్లాడుతూ- నగరం చిత్రానికి ప్రేక్షకులు అందించిన విజయం మర్చిపోలేనిదని, తమిళంలో కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోందని అన్నారు.