16న బాహుబలి-2 ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేక్షకుల్లో అమితాసక్తిని నెలకొల్పిన చిత్రం బాహుబలి. ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి రెండవ భాగానికి సంబంధించిన సన్నాహాలు పూర్తికావచ్చాయి. బాహుబలి మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా రూపొందే బాహుబలి-2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం రేపిన ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎపి, తెలంగాణాలోని కొన్ని థియేటర్లలో ఉదయం ట్రైలర్ విడుదల చేసి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియాలో ట్రైలర్‌ను విడుదల చేస్తారట. దాదాపు 240 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1000 కోట్ల మార్కెట్‌ను టార్గెట్ చేయడం విశేషం. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడనే ఆసక్తితో తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు.